విద్యార్దులకు సమంత విలువైన సలహా!
ఈ నేపథ్యంలో తాజాగా నటి సమంత ఈ అంశంపై మాట్లాడింది. జీవితానికి మంచి మార్కులు, గ్రేడులే ముఖ్యం కావని మానవతా విలువలు కూడా అంతే అవసరమన్నారు.
By: Srikanth Kontham | 6 Oct 2025 8:50 AM ISTచదువు పేరుతో పిల్లలపై పాఠశాలలు, కళాశాలల ఒత్తిడి ఎక్కువవుతోందన్నది వాస్తవం. ర్యాంకుల కోసం బట్టి పట్టించే తీరు మారాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా? అవి అక్కడికే పరిమితమవుతున్నాయి. ఇళ్ల వద్ద తల్లిదండ్రులు కూడా ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో? పలు సూచనలు సలహాలు సైతం ప్రభుత్వాలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నటి సమంత ఈ అంశంపై మాట్లాడింది. జీవితానికి మంచి మార్కులు, గ్రేడులే ముఖ్యం కావని మానవతా విలువలు కూడా అంతే అవసరమన్నారు.
చదువుతో పాటు మంచి విలువలు ఉండేలా పిల్లలకు అన్ని రకాల విద్యలు నేర్పించాలన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సమయం దొరకడం లేదని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయోద్దని విద్యార్దులకు సూచించారు. తాను విద్యార్దిగా ఉండి చాలా కాలమైందని.. కానీ ప్రస్తుతం విద్యార్దుల పడుతోన్న బాధలు, ఇబ్బందుల గురించి పత్రికల్లో , సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు చూస్తుంటే గుండె తరుక్కు పోతుందన్నారు. పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారనిపిస్తుందన్నారు.
తాను స్కూల్ చదువుకుంటోన్న రోజుల్లో అలాంటివి ఏవీ లేవనిస్నేహం, దయ, సానుభూతి, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలే తనకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. మంచి మనిషిగా ఎలా ఉండాలో పాఠశాల నేర్పిస్తుందన్నారు. అప్పుడు నేర్చుకున్నవే జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో సహకరిస్తాయంది. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదరైనా నిలబడే ధైర్యాన్ని కూడా పాఠశాల దశ నుంచే పిల్లలు అలవాటు చేసుకోవాలన్నారు. ఇలాంటి అంశాలతో కూడిన పాఠ్యాంశాలను జోడిస్తే బాగుంటుందన్నారు.
2023 లో దేశంలో విద్యార్దుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయని గుర్తు చేసారు. సమంత సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. సొంతంగా చారిటీలను కూడా నిర్వహిస్తున్నారు. అనాధశ్రమాలు, పిల్లలను చదివించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.ప్రస్తుతం సమంత నటిగా సినిమాలు చేయని సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లకు పని చేస్తోంది. కొత్త సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.
