పీరియడ్స్ నెలవారి రిపోర్ట్ లాంటిందే!
తాజాగా ఈ విషయంపై సామ్ మరో పోస్ట్ చేసింది. ` మన పీరియడ్స్ అనేది నెలవారి రిపోర్ట్ లాంటింది. మహిళల ఆరోగ్యంపై రాశీచౌదరి వివరిస్తున్నారు.
By: Tupaki Desk | 25 May 2025 1:01 PM ISTసమంత స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. సరైన స్క్రిప్ట్ పడితే మ్యాకప్ వేసుకో వడానికి రెడీగా ఉంది. నిర్మాతగా ఇటీవలే `శుభం` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫలితం పర్వాలే దనిపించింది. ఇదే సినిమాలో అమ్మడు గెస్ట్ రోల్ లో కనిపించింది. సామ్ చాలా గ్యాప్ తర్వాత వెండి తెరపై కనిపించే సరికి అభిమానులు సంబర పడ్డారు. సమంతను చూడటానికి థియేటర్కి వెళ్లిన లేడీ ఫ్యాన్స్ ఎంతో మంది. చూసొచ్చి సమంతకు మంచి మార్కులే వేసారు.
కానీ సామ్ నుంచి అభిమానులు కోరుకుంటుంది ఇది కాదు? సమంత మార్క్ చిత్రం అదెప్పుడన్నది మాత్రం అమ్మడు చెప్పడం లేదు. ఆ సంగతి పక్కనబెడితే సమంత సామాజిక అంశాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మహిళల వ్యక్తిగత అంశమైన పీరియడ్స్ గురించి సమంత ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతుంటుంది. తాజాగా ఈ విషయంపై సామ్ మరో పోస్ట్ చేసింది. ` మన పీరియడ్స్ అనేది నెలవారి రిపోర్ట్ లాంటింది. మహిళల ఆరోగ్యంపై రాశీచౌదరి వివరిస్తున్నారు.
మనం సాధారణంగా అడగడానికి సిగ్గుపడే అన్ని ప్రశ్నలను నేను అడిగాను. వాటి నుంచి నుంచి చాలా నేర్చుకున్నాను. మీరు కూడా అలా చేస్తాను నేను భావిస్తున్నాను` అన్నారు. గత నెలలో ఇదే విషయంపై మాట్లాడింది. `పీరియడ్స్ విషయంలో మౌనంగా ఉండిపోతాం. మాట్లాడినా చాలా తక్కువగా మాట్లాడుతాం. బహిరంగంగా చెప్పడాన్ని అవమానంగా భావిస్తాం. ఈ రకమైన మనస్తత్వాన్ని అమ్మాయిలుగా మేము నేర్చుకోవాలి.
ఋతు చక్రం అనేది చాలా శక్తివంతమైనది. ఇది జీవితాన్ని ధృవీకరిస్తుంది. సిగ్గుపడాల్సిన విషయం కాదు. తేలికగాను తీసుకోవాల్సింది కాదు. మనసు, శరీరాన్ని ఋతుచక్రం ఎలా ప్రభావితం చేస్తుందో మనం ప్రతి సంవత్సరం నేర్చుకోవడం కొనసాగించాలి` అని చెప్పుకొచ్చింది.
