ఊ అంటారా.. కిస్సిక్.. ఒకే ఫ్రేములో పుష్ప బామలు
సౌత్ ఇండియా నుంచి వచ్చిన టాలెంట్ ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో చక్కర్లు కొడుతోంది.
By: Tupaki Desk | 27 Jun 2025 11:25 AM ISTసౌత్ ఇండియా నుంచి వచ్చిన టాలెంట్ ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో చక్కర్లు కొడుతోంది. అందమైన నటనతో పాటు ఫ్యాషన్ పరంగానూ తామే ట్రెండ్ సెట్టర్లు అనేలా హీరోయిన్లు హవా చూపుతున్నారు. ఇక అలాంటి స్టార్ హీరోయిన్‌లే ఒకే ఫ్రేమ్‌లో నిలిచారు అంటే? అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. GQ మోస్ట్ ఇన్ ఇన్ ఫ్లూఎన్సేల్ యంగ్ ఇండియన్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగగా చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాన్ ఇండియా స్టార్ సమంత, యంగ్ సెన్సేషన్ శ్రీలీల మెరిశారు. ఇద్దరు కూడా పుష్ప సీరీస్ ఉ అంటావా.. కిస్సిక్ స్పెషల్ సాంగ్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అలాంటిది వీరిద్దరూ ఒక్కసారిగా ఒకే ఫ్రేమ్‌లో దర్శనం ఇవ్వడం మరింత హైలెట్ గా నిలిచింది. వీరిద్దరూ స్టన్నింగ్ అవతారాల్లో కెమెరాకు పోజులిచ్చారు.
ఒకరేమో బోల్డ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ లో హైలెట్ అవ్వగా, మరొకరేమో రెడ్ బాడీకాన్ గౌన్‌లో క్వీన్ లా మెరిశారు. ఈ రీల్‌ను చూసిన నెటిజన్లు ‘సౌత్ క్వీన్స్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాషన్ లుక్ లో అక్కడున్న వారిని సామ్ మంత్రముగ్దులను చేసిన చేయగా, గ్లామర్ ఎక్స్‌ప్రెషన్‌తో శ్రీలీల మరింత అందంగా కనిపించింది. ఇద్దరికీ ఈ అవార్డు ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక వీరిద్దరి కెరీర్ పై ఓ లుక్కేస్తే, సమంత ఇప్పటికే సిటాడెల్ తో బాలీవుడ్ లో క్రేజ్ అందుకొని రక్త బ్రహ్మాండ అనే ప్రాజెక్టును లైన్ లో పెట్టింది. మరోవైపు శ్రీలీల పలు పెద్ద సినిమా షూటింగ్స్‌తో బిజీ అవుతొంది. ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర సినిమాలను లైన్ లో పెట్టింది. ఇక ఈఇద్దరూ తమ తరం స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. ఇప్పుడు ఈ పిక్స్ ద్వారా ఇద్దరిలోని హై క్లాస్ ఫ్యాషన్ ట్రెండ్ ను హైలెట్ చేశారు.
