నా ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేస్తేనే కామెంట్స్ చేయండి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా సినిమాల కంటే సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
By: Tupaki Desk | 29 Jun 2025 12:48 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా సినిమాల కంటే సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో తన శరీరాకృతి గురించి కామెంట్స్ చేసే వారికి సమంత గట్టి కౌంటర్ ఇచ్చారు. తనను విమర్శిస్తున్న వారికి ఫిట్‌నెస్ విషయంలో ఛాలెంజ్ చేస్తూ తాను జిమ్ లో చేస్తున్న పుల్ అప్స్ వీడియోను షేర్ చేశారు.
రీసెంట్ గా సమంత ఓ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొనగా, ఆ ఈవెంట్ నుంచి పలు ఫోటోలు బయటకు రాగా, అందులో సమంత లుక్స్ చూసి చాలా మంది నెటిజన్లు సన్నగా అయిపోయావు, అనారోగ్యంగా కనిపిస్తున్నావంటూ కామెంట్స్ చేశారు. దీనిపై రెస్పాండ్ అవుతూ సమంత తన ఇన్‌స్టాలో ఓ స్టోరీని పెడుతూ తనను కామెంట్స్ చేసేవారికి సవాల్ విసిరారు.
ఆ వీడియోలో సమంత ఎలాగైతే పుల్ అప్స్ చేశారో, తన గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే వారు కూడా కనీసం మూడు పుల్ అప్స్ తీసి చూపించాలని, అలా చేసిన వాళ్లే తన గురించి కామెంట్స్ చేయాలని, లేని పక్షంలో తన గురించి మాట్లాడటం మానేయమని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు సమంత. కాగా సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
గత కొంతకాలంగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సమంత, ఆ ట్రీట్‌మెంట్ లో భాగంగా తన ఒరిజినల్ లుక్ ను కాస్త కోల్పోయిన మాట నిజమే అయినప్పటికీ, నెటిజన్లు ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే అమ్మడు త్వరలోనే రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సిరీస్ ఆగిపోయిందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తుండగా, ఈ సిరీస్ కు సంబంధించిన కీలక సీన్స్ ను ఆల్రెడీ ఫినిష్ చేశామని, త్వరలోనే ఓ భారీ అవుట్‌డోర్ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే క్లారిటీ ఇచ్చారు.
