సమంత శుభం.. వ్వాటే కాన్ఫిడెన్స్!
స్టార్ హీరోయిన్‌గా ఎందరో ప్రేక్షకులను మెప్పించిన సమంత ఇప్పుడు నిర్మాతగా తన టాలెంట్‌ను చాటేందుకు సిద్ధమైంది.
By: Tupaki Desk | 7 April 2025 11:22 AM ISTస్టార్ హీరోయిన్‌గా ఎందరో ప్రేక్షకులను మెప్పించిన సమంత ఇప్పుడు నిర్మాతగా తన టాలెంట్‌ను చాటేందుకు సిద్ధమైంది. ఆమె స్థాపించిన ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై తెరకెక్కిన తొలి సినిమా ‘శుభం’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. అయితే ఇందులో విశేషం ఏమిటంటే, సమంత ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో ఆమె పర్సనల్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. చిన్న టీమ్ అయినా పెద్ద కలలతో ముందుకెళ్తామని చెప్పిన ఆమె, ఈ ప్రయాణం ఎంతో ప్రత్యేకమైందని వెల్లడించింది.
టీజర్ విడుదల తర్వాత పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల నుండి కూడా ‘శుభం’కు మంచి స్పందన వచ్చింది. హారర్ కామెడీ మిక్స్‌గా రూపొందిన ఈ చిత్ర టీజర్ భయాన్ని నవ్వులతో మిక్స్ చేస్తూ ఓ విభిన్న అనుభూతిని ఇచ్చింది. సమంత సొంత బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో, ఫ్యాన్స్‌కి కూడా ఈ సినిమా మీద స్పెషల్ అట్రాక్షన్ ఏర్పడింది. దీనికి తోడు, సమంత వ్యక్తిగతంగా దీని ప్రమోషన్‌లో చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తోంది.
“ఓ చిన్న టీమ్.. పెద్ద కలలతో తీసిన ఈ సినిమా మా శ్రమ ఫలితం” అంటూ సమంత పోస్ట్ చేయడమే కాదు, ఆమె ఈ సినిమాపై ఎంతో ఎమోషనల్‌గా ఉండటాన్ని కూడా ఫ్యాన్స్ గమనిస్తున్నారు. కొత్త వాళ్లతో ప్రయోగం చేసినప్పటికీ, కంటెంట్ మీద సమంతకు ఉన్న నమ్మకమే ఈ సినిమా వెనక దాగి ఉంది. ఈ ప్రయాణం తమకు ఎంతో విలువైనదిగా మిగిలిపోతుందనే నమ్మకాన్ని ఆమె ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రెగుల దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిగా కొత్త నటీనటులతో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ మూవీకి వివేక్ సాగర్, క్లింటన్ సెరెజో లు సంగీతం అందిస్తున్నారు. టీజర్ చివరి 10 సెకన్లలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. పల్లె వాతావరణం చుట్టూ తిరిగే కథ, కామెడీ డైలాగ్స్‌తో కూడిన ఈ టీజర్, ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించేలా కనిపిస్తోంది.
సమంత హీరోయిన్‌గా ఎన్నో విజయాలు సాధించినా, నిర్మాతగా ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. స్టార్ డమ్ కాకుండా కంటెంట్ మీద ఆధారపడి సినిమాను తీర్చిదిద్దిన సమంతకు, ఈ ప్రయోగం ఎంత వరకూ క్లిక్ అవుతుందో చూడాలి. అయితే, ఇప్పటివరకు వచ్చిన స్పందన చూస్తుంటే ఈ చిత్రం కూడా హిట్ ట్రాక్‌ను ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి, సమంత ప్రొడక్షన్ బ్యానర్ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘శుభం’ టీజర్ అంచనాలను పెంచింది. కంటెంట్ మీద నమ్మకంతో ముందుకెళ్తున్న ఈ ప్రయోగం సమంతకు ఓ కొత్త రూట్‌లో బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకొచ్చేలా ఉంది. ఈ వేసవిలో థియేటర్లలో ‘శుభం’ ఎలా అలరిస్తుందో చూడాలి.
