‘శుభం’.. నష్టాలు లేకుండా సామ్ సేఫ్ బిజినెస్!
సమంత రూత్ ప్రభు నిర్మాతగా కొన్నేళ్ల క్రితం యూ టర్న్ అనే సినిమా చేసింది.
By: Tupaki Desk | 7 May 2025 4:00 PM ISTసమంత రూత్ ప్రభు నిర్మాతగా కొన్నేళ్ల క్రితం యూ టర్న్ అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మళ్ళీ నిర్మాతగా ఎక్కడ పెట్టుబడులు పెట్టలేదు. ఇక ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీతో చేసిన చిత్రం ‘శుభం’తో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. మే 9న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానున్న ఈ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్, రిలీజ్‌కు ముందే మంచి బిజినెస్‌తో దూసుకెళ్తోంది.
ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్‌లో, సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా, ట్రైలర్‌తోనే సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. సమంత ఈ సినిమాలో మతాజీ పాత్రలో నటిస్తూ, నిర్మాతగా తన సత్తా చాటుతోంది. అలాగే రెగ్యులర్ ప్రమోషన్ లో పాల్గొంటూ సినిమాకు పాజిటివ్ హైప్ క్రియేట్ చేస్తోంది.
ఇక సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు క్లోజ్ అయినట్లు సమాచారం. జీ గ్రూప్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. అటు నెట్ ఫ్లిక్స్ సంస్థతో ఓటీటీ డీల్స్ కూడా ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. ఈ రెండు డీల్స్‌తోనే ‘శుభం’ టేబుల్ ప్రాఫిట్ సొంతం చేసుకున్నట్లు టాక్. ఈ డీల్స్ వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ, సినిమా బడ్జెట్‌ను ఈ రైట్స్ ద్వారానే రికవర్ చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ లెక్కన ‘శుభం’ సినిమా సమంతకు నిర్మాతగా తొలి సక్సెస్‌ను అందించినట్లే. ఈ సినిమా కథ 2004లో భీమునిపట్నం నేపథ్యంలో సాగుతుంది. ముగ్గురు స్నేహితుల జీవితాల్లో, వారి భార్యలు టీవీ సీరియల్‌కు అడిక్ట్ అవడం, ఆ తర్వాత వారు పొసెస్డ్ అయినట్లు ప్రవర్తించడం ఈ సినిమా కథాంశం. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వారు సమంత పోషించిన మతాజీ సాయం తీసుకుంటారు.
ఈ కామెడీ థ్రిల్లర్ సమ్మర్ సీజన్‌కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని టాక్. ఈ రోజు హైదరాబాద్‌లో మూడు థియేటర్లలో ‘శుభం’ పెయిడ్ ప్రీమియర్ షోలు కొనసాగుతున్నాయి. మొదటి షోలు హౌస్‌ఫుల్‌తో దూసుకెళ్లాయి. ఈ రెస్పాన్స్ చూస్తుంటే మరిన్ని థియేటర్లలో ప్రీమియర్ షోలు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ షోలకు వచ్చిన ఆడియన్స్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది, ఇది రిలీజ్ డే బుకింగ్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ నటిస్తున్నారు. షోర్ పోలీస్ సంగీతం, వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలుస్తున్నాయి. సమంత తన నిర్మాణ సంస్థ ద్వారా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, నిర్మాతగా సక్సెస్‌ఫుల్ జర్నీ మొదలుపెట్టింది. మొత్తంగా, ‘శుభం’ సినిమా నాన్-థియేట్రికల్ డీల్స్‌తో టేబుల్ ప్రాఫిట్ సాధించడంతో సమంత నిర్మాతగా తొలి అడుగు సక్సెస్ అయినట్లే.
