నిర్మాతగా మొదటి శుక్రవారం.. ఆ కష్టం ఏంటో ఇప్పుడు తెలుస్తుంది..!
స్టార్ హీరోయిన్ సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో తొలి సినిమా శుభం నిర్మించారు.
By: Tupaki Desk | 6 May 2025 9:23 PM ISTస్టార్ హీరోయిన్ సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో తొలి సినిమా శుభం నిర్మించారు. మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ చెప్పేందుకు సమంత మీడియాతో ముచ్చటించారు.. సినిమా గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారు.
నటిగా శుక్రవారం ఎలా ఉంటుందో అనుభవం ఉంది కానీ నిర్మాతగా ఇది మొదటి శుక్రవారం. నర్వెస్ గా ఉంది. ఒక నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయన్నది ఇప్పుడు అర్థమవుతుంది. వారం రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నా సినిమాకు సంబంధించిన అన్ని టీం లు నిద్రలేకుండా పనిచేస్తున్నారు. అందుకు టీం మీద మరింత గౌరవం పెరిగిందని అన్నారు సమంత. అంతేకాదు శుభం సినిమా బాగా వచ్చింది.. మంచి కథ అందుకే సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నానని అన్నారు.
నటిగా చాలా చేశా కానీ ఇంకా ఏదో చేయాలన్న తపన కోరిక ఉన్నాయి. అందుకే బ్రేక్ టైం లో నిర్మాతగా మారాలనే ఆలోచన వచ్చింది. సినిమాల్లో నటించకపోయినా నిర్మించవచ్చు.. కెరీర్ మొదలు పెట్టి 15 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్లు అనుభవం ఉంది కదా అని ప్రొడక్షన్ స్టార్ట్ చేశా ఐతే ఎలాంటి హడావిడి లేకుండా సినిమా మొదలు పెట్టాం. 8 నెలల్లో సినిమా పూర్తి చేశామని అన్నారు సమంత.
ఈ సినిమాకు శుభం టైటిల్ పెట్టడానికి కారణం చెప్పారు సమంత. సినిమా ఎక్కువగా సీరియల్ గురించి ఉంటుంది. ఆ సీరియల్ కి శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందా అన్నది ఎదురుచూస్తారు. అందుకే ఆ టైటిల్ పెట్టామని అన్నారు సమంత. చిన్నప్పుడు బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్ పధ్యం ఉంది అందుకే ట్రాలాలా అని పెట్టానని అన్నారు సమంత.
సినిమాల్లో గౌతమ్ మీనన్ నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఆ టైం లో ఆయన టాప్ హీరోయిన్ నే తీసుకునే అవకాశం ఉంది. కానీ నాలాంటి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అందుకే నిర్మాతగా మారాక కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నా అన్నారు సమంత. సినిమాల్లో రాణించాలని ఎన్నో కలలు కంటూ వస్తారు.. మా సినిమా కోసం శ్రియా, శ్రావణి, షాలినీలు ఎంతో కష్టపడ్డారు. వాళ్లని చూస్తే నా పాత రోజులు గుర్తొచ్చాయని అన్నారు స్మంత.
ఇక నటిగా ఉన్నప్పుడు నిర్మాత కష్టాలు అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు ఒక్క సీన్ అనుకున్నట్టుగా రాకపోతే ఎంత నష్టం వస్తుంది. డబ్బు ఎంత వృధా అవుతుంది అన్నది తెలిసిందని అన్నారు. శుభం లో క్యామియో తాను చేయాల్సింది కాదు. కానీ నిర్మాతగా చేస్తున్న మొదటి సినిమాకే ఎవరి దగ్గరకి వెళ్లి ఫేవర్ అడగాలని అనుకోలేదు. అందుకే ఆ పాత్ర తానే చేశానని అన్నారు సమంత.
శుభం సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలో అంత పెట్టేశాం. సినిమా చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ఇక ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాలో చేస్తున్నా. జూన్ నుంచి మళ్లీ షూట్ కి వెళ్తున్నాం. షూట్ మొదలయ్యాక మళ్లీ అప్డేట్స్ వస్తాయని అన్నారు సమంత.
