సమంత 'శుభం' ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే
విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన శుభం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సమంత తెలుగు అభిమానులకు చేరువ అయింది.
By: Tupaki Desk | 2 Jun 2025 1:46 AM ISTసమంత ఖుషి సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాలేదు. గత ఏడాదిలో సమంత నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడంతో అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. అసలు సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేసిన వారికి సమాధానంగా శుభమ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. శుభం సినిమాకు సమంత హీరోయిన్‌గా కాకుండా నిర్మాతగా వ్యవహరించిన విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత తెలుగు మీడియా ముందుకు శుభమ్ సినిమా కోసం సమంత వచ్చిన విషయం తెల్సిందే. శుభం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో సమంత చాలా యాక్టివ్‌గా పాల్గొన్నారు.
విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన శుభం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సమంత తెలుగు అభిమానులకు చేరువ అయింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శుభం సినిమా థియేట్రికల్ రన్ ఓ మోస్తరుగా నడిచింది. అయితే ఓటీటీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. జూన్ 13న ఈ సినిమాను జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. రెండు వారాల ముందుగానే జియో హాట్‌స్టార్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభం సినిమా స్ట్రీమింగ్ కోసం సమంత అభిమానులు ఎదురు చూస్తున్నారు.
థియేటర్‌లలో పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా వసూళ్లు ఆశించిన స్థాయిలో దక్కలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. అందుకే శుభం సినిమాను ఓటీటీలో కచ్చితంగా ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయి అంటూ సమంత అభిమానులు చెబుతున్నారు. సమంత ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల వారు శుభం సినిమాను కచ్చితంగా అభిమానిస్తారు అనే విశ్వాసం ను ఓటీటీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.
శుభమ్ సినిమాతో సమంతకు మంచి ఫలితం దక్కిందని సమాచారం. థియేట్రికల్ రైట్స్‌తో మాత్రమే కాకుండా ఓటీటీ రైట్స్ ద్వారా భారీ మొత్తాన్ని సమంత నిర్మాతగా దక్కించుకుందని తెలుస్తోంది. సినిమాకు సమంత పెట్టిన పెట్టుబడి పెద్దగా ఏమీ లేదట.. కానీ ఆమెకు ఈ సినిమాతో దక్కిన లాభం చాలా ఎక్కువగా ఉందని సమాచారం. ఆ లెక్కలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం సమంత రెండు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. మరో వైపు రెండు సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. ఒకటి తెలుగు సినిమా కాగా మరోటి హిందీ సినిమా. ముందు ముందు తెలుగులో కమర్షియల్ సినిమాల్లో సమంత నటించే అవకాశం ఉందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు సమంత నుంచి సమాధానం రావాల్సి ఉంది.
