Begin typing your search above and press return to search.

ఫస్ట్ డే ఈ సినిమా చూసేవాళ్ళు లక్కీ

మేకర్స్ రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, అప్పుడు ప్రవీణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 May 2025 5:42 AM
ఫస్ట్ డే ఈ సినిమా చూసేవాళ్ళు లక్కీ
X

స్టార్ హీరోయిన్ సమంత.. ఓవైపు నటిగా.. మరో వైపు నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మండ్ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో తాను నిర్మించిన శుభం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. టాలీవుడ్ లక్కీ డేట్ మే9న ఆ సినిమా రిలీజ్ కానుంది.

ఫేమస్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్న సినిమా బండి మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రవీణ్ కండ్రేగుల శుభం సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాలో కొత్త వాళ్లే నటించారు. సామ్ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తూ నటించారు కూడా. అయితే ఇప్పుడు డైరెక్టర్ స్పీచ్ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

మేకర్స్ రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, అప్పుడు ప్రవీణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగులో శుభం లాంటి మూవీ రాలేదని ఆయన తెలిపారు. మూవీ చూసి అంతా కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారని అన్నారు. ఇలాంటి హారర్ కామెడీని తెలుగు ప్రేక్షకులు ఫస్ట్ టైమ్ విట్నెస్ చేస్తారని తెలిపారు.

అదే సమయంలో శుభం మూవీని మార్నింగ్ షోలో చూసేవాళ్లు లక్కీ అని తెలిపారు. లేకుంటే టాక్ స్ప్రెడ్ అయ్యి వీకెండ్ లో అందరూ ఏంటి ఈ సినిమా అంటూ మాట్లాడుకుంటారని చెప్పారు. అంతే కాదు.. వైజాగ్ పై ప్రమాణం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. దీంతో ఈవెంట్ కు వచ్చిన వారితోపాటు అంతా షాక్ అయ్యారు.

అయితే సినిమా కోసం ప్రమోషన్స్ లో మేకర్స్ గొప్పగా మాట్లాడడం కామనే. కానీ మూవీ సూపర్ హిట్ అయితే ఆయా కామెంట్స్ కు విలువ ఉంటుంది. లేకపోతే లేనిపోని విమర్శలు వస్తాయి. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదని అంతా కామెంట్స్ పెడతారు. కేవలం వైరల్ అవ్వాలనే టార్గెట్ తో అలా మాట్లాడారని అంటారు.

ఇప్పుడు ప్రవీణ్ కామెంట్స్ విషయమేంటో తేలాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాలి. మరో నాలుగు రోజుల్లో సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. అదే రోజు శ్రీవిష్ణు సింగిల్ మూవీ రిలీజ్ కానుంది. అయితే మూవీపై సమంత కూడా నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. మరేం జరుగుతుందో.. శుభం మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.