నిర్మాతగా మారడం వెనుక సమంత ప్లాన్ అదేనా?
సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న డిమాండ్, క్రేజ్ హీరోయిన్లకు ఉండదు. అంతేకాదు, ఇండస్ట్రీలో హీరోలు ఉన్నంత కాలం హీరోయిన్లు కంటిన్యూ అవలేరు.
By: Tupaki Desk | 7 May 2025 10:57 AM ISTసినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న డిమాండ్, క్రేజ్ హీరోయిన్లకు ఉండదు. అంతేకాదు, ఇండస్ట్రీలో హీరోలు ఉన్నంత కాలం హీరోయిన్లు కంటిన్యూ అవలేరు. లైమ్ లైట్ లో ఉంటూ ఫామ్ లో ఉన్నప్పుడు ఉండే డిమాండ్ ఎప్పుడూ ఉండదు. ఫామ్ లో ఉన్నప్పుడు వెంటపడే దర్శకనిర్మాతలు, ఫ్యాన్స్, మీడియా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్సే ఆ ఫామ్ కోల్పోయాక వారిని లైట్ తీసుకుంటాయి.
ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. నాలుగేళ్ల ముందు వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత, ఆ తర్వాత పలు కారణాలతో అనుకున్న ఫామ్ లో లేకుండా పోయింది. చైతన్య తో విడాకులు, అదే టైమ్ లో మయోసైటిస్ అనే వ్యాధితో ఎంతో బాధ పడుతూ సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడం జరిగాయి.
అలా బ్రేక్ తీసుకున్న సమంతకు ఇప్పుడు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా పెద్దగా ఛాన్సులు రావడం లేదు. దానికి తోడు సమంత వయసు కూడా పెరిగింది. అందుకే హీరోయిన్ గా ఛాన్సులు రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తే అది అంచనాలను తట్టుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సమంత చాలా తెలివైన స్టెప్ వేసింది.
హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన నేపథ్యంలో తనకు తెలిసిన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి రెండు సినిమాలను మొదలుపెట్టింది. వాటిలో ఒకటి సమంత మెయిన్ లీడ్ గా వస్తున్న మా ఇంటి బంగారం కాగా, రెండోది సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో సమంత కీలక పాత్రలో చేస్తున్న శుభం.
వాటిలో మా ఇంటి బంగారం గురించి అనౌన్స్‌మెంట్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. కానీ శుభం సినిమా మాత్రం అసలెప్పుడు మొదలైందో ఎప్పుడు పూర్తైందో తెలియకుండానే నేరుగా రిలీజ్ కు రెడీ చేసి టీజర్ తో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది సమంత. శుభం మూవీ టీజర్, ట్రైలర్ రెండింటికి ఆడియన్స్ నుంచి మంచి బజ్ ను సంపాదించింది.
మే 9న రిలీజ్ కానున్న శుభం సినిమాపై సమంతతో పాటూ చిత్ర యూనిట్ మొత్తం కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సర్‌ప్రైజ్ హిట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అసలే ప్రస్తుతం బాక్సాఫీస్ పరిస్థితులేం బాలేవు. గత వారం వచ్చిన హిట్3 సినిమా సూపర్ హిట్ తెచ్చుకున్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి ఆడియన్స్ థియేటర్లకు వెళ్లి చూసే సినిమాలు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఫ్యామిలీలు మొత్తం చూసే సినిమా రాలేదనే చెప్పాలి. ఇప్పుడు శుభం ఆ లోటుని తీరుస్తుందా లేదా అనేది చూడాలి. అసలే స్కూల్స్ కు హాలిడేస్ ఇచ్చిన టైమ్ లో ఈ సినిమా రిలీజవుతుది. ఒకవేళ శుభం హిట్ అయితే థియేటర్లు కళకళలాడటంతో పాటూ అవసరమైన టైమ్ లో ఇండస్ట్రీకి ఒక సక్సెస్ కూడా దక్కినట్టవుతుంది. దాంతో పాటూ నటిగా, నిర్మాతగా సమంతకు కూడా బ్రేక్ దొరుకుతుంది. ఈ సినిమాను చూసి సమంతకు రాబోయే సినిమాల్లో కీలక పాత్రలు కూడా మరిన్ని వచ్చి ఆమె కూడా బిజీ అయ్యే ఛాన్సుంది. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకునే సమంత నిర్మాతగా మారిందని అర్థం అవుతుంది. మరి శుభం సినిమా సమంతకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
