నేనెప్పుడూ అలా అనుకోలేదు.. లైఫ్ లో ఇక చేయను!: సామ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 11 May 2025 6:03 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నార్త్ టు సౌత్ ఓ రేంజ్ లో వసూళ్లను రాబట్టింది. బన్నీ కెరీర్ గ్రాఫ్ నే మార్చేసింది. అయితే సినిమాలోని స్టార్ హీరోయిన్ సమంత చేసిన సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అంటూ సామ్ చేసిన సాంగ్.. వేరే లెవెల్ లో హిట్ అయింది. ఇప్పటికీ ఆ సాంగ్ ఎవర్ గ్రీనే అని చెప్పాలి. అనేక చోట్ల ఆ పాట వినిపిస్తూనే ఉంటోంది. అంతలా ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్ మెప్పించింది. ముఖ్యంగా సామ్ వేసిన స్టెప్పులు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెవ్వర్ బిఫోర్.
సోషల్ మీడియాలో ఆ సాంగ్ భారీ వ్యూస్ రాబట్టింది. అయితే సామ్ ఐటెమ్ సాంగ్ చేస్తుందనే ప్రకటన రాగానే.. ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత సాంగ్ వచ్చాక అంతకుమించి హిట్ అయ్యింది. అదే సమయంలో సమంత ఐటెమ్ సాంగ్ చేయడం పట్ల కొందరు సినీ ప్రియులు పెదవి విరిచారు. మరికొందరు మెచ్చుకున్నారు.
ఇప్పుడు ఆ సాంగ్ పై ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు సమంత. ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్ చేసే ఆఫర్ వచ్చినప్పుడు చాలామంది చేయొద్దని తనతో చెప్పారని తెలిపారు. అయితే తానెప్పుడూ ఒక హా*ట్ గర్ల్ గా అనుకోలేదని చెప్పారు. ఆ విధంగా తానెప్పుడూ అస్సలు ఊహించుకోలేదని సమంత పేర్కొన్నారు.
కానీ ఆ సాంగ్ ఆఫర్ వచ్చినప్పుడు ఒక సవాలుగా తీసుకున్నానని, అలాగే పని చేశానని తెలిపారు సామ్. అయితే సెట్స్ లో అడుగు పెట్టినప్పుడు చాలా కంగారుపడ్డానని వెల్లడించారు. కానీ ధైర్యంగా సాంగ్ ను కంప్లీట్ చేసినట్లు తెలిపారు. మళ్లీ భవిష్యత్తులో అలాంటి పాటల్లో యాక్ట్ చేస్తాననుకోవడం లేదుని క్లారిటీ ఇచ్చారు.
ఇక సాంగ్ విషయానికొస్తే.. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ అందించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. మంగ్లీ సిస్టర్, సింగర్ ఇంద్రావతి తన హస్కీ వాయిస్ తో ఆలపించారు. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్.. 47 కోట్లకు పైగా వ్యూస్ అందుకుని ఇంకా దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు!
