ఆ స్టార్ హీరోయిన్ తో శేఖర్ లేడీ ఓరియెంటెడ్ మూవీ?
తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల మంచి పేరు తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 3 July 2025 9:00 PM ISTతెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో ఆశలతో డైరెక్టర్ గా మారిన శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మరిన్ని సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు శేఖర్ కమ్ముల. ఇంకా చెప్పాలంటే ఆయన సినిమాలకు ఓ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది.
శేఖర్ కమ్ముల లాగానే ఆయన కథలు, సినిమాలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. రెగ్యులర్ గా మాస్ సినిమాలు, యాక్షన్ మూవీస్, థ్రిల్లర్ సినిమాలు చూసే ఆడియన్స్ కు ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చే ఆయన సినిమాలు మంచి రిలీఫ్ ను ఇస్తాయి. రీసెంట్ గా కుబేర తో మంచి సక్సెస్ ను అందుకున్న శేఖర్ కమ్ముల తర్వాత ఎవరితో సినిమా చేయనున్నారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల ఓ స్టార్ హీరోయిన్ తో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. కుబేర తర్వాత శేఖర్ కమ్ముల ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నారని, ఆ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించనున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడింది లేదు.
ఈ సినిమాలో శేఖర్ కమ్ముల సమంతను ఎంతో పవర్‌ఫుల్ రోల్ లో చూపించనున్నారని సమాచారం. కేవలం రొమాంటిక్ సినిమాలు మాత్రమే కాకుండా అన్ని రకాల జానర్లను చేయగల సమంత ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ మరియు మా ఇంటి బంగారం అనే సినిమాలు చేస్తున్న సమంత, శేఖర్ కమ్ములతో కలిసి ఎలాంటి సినిమాను చేస్తారో చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సుంది.
