18 ఏళ్లకే సమంత టాటూ.. అతడిని పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయ్యి!
కానీ ఆ టాటూ ఎక్కడ ఉందో ఇప్పుడు చెప్పనని అన్నారు. ఆ వివరాలు చెప్పడం ఇష్టం లేదని చెప్పారు. అదే సమయంలో ఎవరిని ప్రేమించారో కూడా చెప్పలేదు.
By: Tupaki Desk | 4 July 2025 9:01 AM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టాటూల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె ఎప్పుడు పిక్స్ పోస్ట్ చేసినా.. టాటూల కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు. సామ్ మెడపై ఎప్పుడూ ఉండే వైఎంసీ టాటూ చెరిపేశారని ఇటీవల వార్తలు వచ్చిన వచ్చాయి.
కానీ ఆ తర్వాత ముంబైలోని తన జిమ్ లో నుంచి సామ్ బయటకు వస్తుండగా.. ఫొటోగ్లాఫర్లు తెగ పిక్స్ తీశారు. అప్పుడు ఆమె ఫైర్ అయినా.. ఆ ఫోటోల్లో మెడపై టాటూ కనిపించింది. దీంతో ఆమె చెరిపేయలేదని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సమంత మరో టాటూ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
అందుకు కారణం ఆమె కామెంట్సే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ టాటూ గురించి మాట్లాడారు సమంత. 18 ఏళ్ల వయసులో టాటూ వేయించుకున్నానని తెలిపారు. అప్పుడు ప్రేమలో ఉన్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని భావించానని చెప్పారు. అందుకే టాటూకు ప్రొసీడ్ అయ్యారని పేర్కొన్నారు.
కానీ ఆ టాటూ ఎక్కడ ఉందో ఇప్పుడు చెప్పనని అన్నారు. ఆ వివరాలు చెప్పడం ఇష్టం లేదని చెప్పారు. అదే సమయంలో ఎవరిని ప్రేమించారో కూడా చెప్పలేదు. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు నెటిజన్లు.
ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన అమ్మడు రీసెంట్ గా శుభం మూవీలో క్యామియో రోల్ పోషించారు. ఆ సినిమాను తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంతనే నిర్మించారు. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీలో నటిస్తున్న సామ్.. షూటింగ్ ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఇటీవల సమంత.. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశారు. తన యాక్టింగ్ తో మెప్పించారు. ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్ డమ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. 2025లోనే ఆ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని ప్రాజెక్టులను సామ్ లైన్ లో పెడుతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.
