Begin typing your search above and press return to search.

సమంత బేబీ పేర్లు ఫిక్స్ చేసిన ఫ్యాన్స్.. సామ్ రిప్లై మామూలుగా లేదుగా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన జీవితంలో అత్యంత మధురమైన మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   31 Aug 2026 11:00 PM IST
సమంత బేబీ పేర్లు ఫిక్స్ చేసిన ఫ్యాన్స్.. సామ్ రిప్లై మామూలుగా లేదుగా!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన జీవితంలో అత్యంత మధురమైన మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న ఆమె ఇప్పుడు తల్లి కాబోతోంది. జూన్ లో తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించిన దగ్గరి నుంచి అభిమానులతో టచ్ లోనే ఉంటోంది. లేటెస్ట్ గా ఇంట్లో రిలాక్స్ అవుతున్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందులో బేబీ బంప్ కూడా కనిపించింది.

సమంత తన ప్రెగ్నెన్సీ జర్నీ ఫొటోలు షేర్ చేయగానే నెట్టింట అవి వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెడితే బాగుంటుందో సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒక అభిమాని పెట్టిన కామెంట్ అందరి ఎట్రాక్ట్ చేయడంతో పాటు సమంతను కూడా బాగా ఆకట్టుకుంది.

ఆ అభిమాని సమంత రాజ్ పేర్లను కలిపి క్రియేటివ్ గా కొత్త పేర్లను సజెస్ట్ చేశాడు. పాప పుడితే సమైరా అని బాబు పుడితే సమ్రాజ్ అని పేరు పెట్టాలని ఆ కామెంట్ లో రాసుకొచ్చాడు. సామ్ రాజ్ ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ఉండటం విశేషం. ఈ కామెంట్ కు నెటిజన్ల నుంచి కూడా మంచి రియాక్షన్స్ వచ్చాయి. ఈ ఐడియా చూసి చాలా మంది ఆ పేర్లు బాగున్నాయని రిప్లై ఇచ్చారు.

ఈ కామెంట్ చూసిన సమంత తనదైన స్టైల్ లో ఫన్నీగా రిప్లై ఇచ్చింది. సమ్రాజ్ అనే పేరు గురించి ప్రస్తావిస్తూ ఆ పేరు పెట్టుకుంటే మన గురించి మనమే ఎక్కువగా డబ్బా కొట్టుకున్నట్లు అనిపించడం లేదా అంటూ నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేసింది. సామ్ ఇచ్చిన ఈ సరదా రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తన మీద తానే సెటైర్ వేసుకున్న ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

సినిమాల విషయానికి వస్తే సమంత ఈ మధ్యే మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ నిడిమోరు నిర్మాణంలో నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల వసూళ్లు సాధించి హిట్ గా నిలిచింది. ఈ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత సమంత అధికారికంగా మెటర్నిటీ బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరం కాలేదు. జూలై లో సోనీ లివ్ తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. అది సిరీస్ లేక సినిమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మా ఇంటి బంగారం సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని రాజ్ ఇప్పటికే చెప్పారు.