ప్రేమ ఓకే కానీ అలా చేస్తానంటే మాత్రం..!
ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు అప్పటి నుంచి ఆడియన్స్ ని మాయ చేస్తూనే ఉంది.
By: Tupaki Desk | 6 May 2025 9:09 PM ISTసౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు అప్పటి నుంచి ఆడియన్స్ ని మాయ చేస్తూనే ఉంది. ప్రస్తుతం సినిమాలను బాగా తగ్గించిన సమంత చేసినా బాలీవుడ్ లోనే చేస్తుంది. ఈమధ్యనే సిటాడెల్ సీరీస్ తో మెప్పించిన సమంత కొత్తగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ పెట్టి శుభం అనే సినిమా నిర్మించింది. ఈ సినిమాను ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ యాక్టివిటీస్ లో సమంత కూడా భాగమవుతుంది. ఐతే సమంత ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో భాగంగా ఇక మీదట తన పర్సనల్ లైఫ్ విషయాల గురించి ఎక్కడ ప్రస్తావించకూడదని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. ఇక అభిమానులు చూపించే ప్రేమ అభిమానం బాగుంటుంది. కానీ గుడి కట్టి పూజించేలా ఉంటేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయనని అంటుంది సమంత. అభిమానుల ప్రేమ ఎంతైనా తీసుకుంటా కానీ ఇలాంటివి ప్రోత్సహించలేం అని అంటుంది సమంత.
సమంత ఖుషి తర్వాత తెలుగు సినిమా చేయలేదు. ఐతే మన మేకర్స్ సమంతతో చేయాలని అనుకోవడం లేదా ఒకవేళ సమంతానే కావాలని ఇక్కడ కథలను కాదంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే సమంత మాత్రం మంచి కథ వస్తే తప్పకుండా తెలుగులో నటించేందుకు రెడీ అన్నట్టుగానే చెబుతుంది. బాలీవుడ్ లో మాత్రం సమంత తన యాక్షన్ లో అలరిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ రెండు సీరీస్ లతో బీ టౌన్ ఆడియన్స్ కు దగ్గరైంది సమంత.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో సమంత మొదటి ప్రాజెక్ట్ శుభం 9న రిలీజ్ అవుతుంది. ఐతే ఈ సినిమా విషయంలో సమంత చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. యువ టాలెంటెడ్ పీపుల్ తో సమంత చేసిన ఈ ప్రయత్నం మెప్పించేలా ఉందని చెప్పొచ్చు. శుభం సినిమాతో సమంత తొలి సినిమా సక్సెస్ అయితే అదే తరహాలో మరికొన్ని సినిమాలు నిర్మించాలని చూస్తుంది. సమంత సినిమాలు చేయకపోయినా ఇప్పటికీ టాలీవుడ్ లో ఆమె క్రేజ్ అలానే ఉంది. ఐతే తనని ఎగ్జైట్ చేసే కథ వస్తే తప్పకుండా తెలుగులో చేసేందుకు సమంత వెనకాడదని చెప్పొచ్చు. మరి అలాంటి కథ ఎప్పుడు దొరుకుతుందో అని ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
