ఫొటో టాక్: వజ్రంలా సమంత వయ్యారాలు..
స్టార్డమ్, అందం, అభినయం… ఈ మూడు మాటల్ని ఒకేచోట గుర్తుకు తెస్తే గుర్తొచ్చే పేరు సమంత. ఆమె కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేసి క్రేజ్ సంపాదించుకుంది
By: Tupaki Desk | 7 April 2025 8:52 PM ISTస్టార్డమ్, అందం, అభినయం… ఈ మూడు మాటల్ని ఒకేచోట గుర్తుకు తెస్తే గుర్తొచ్చే పేరు సమంత. ఆమె కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేసి క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తుందో, అదే విధంగా రియల్ లైఫ్‌లో కూడా ట్రెండింగ్ ఫ్యాషన్‌కు సరైన నిర్వచనంలా కనిపిస్తుంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు చూసినవాళ్లంతా "ఇది కలలలో చూసే లుక్" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఆఫ్ వైట్ క్రీమ్ షేడ్ లో డిజైనర్ శారీ, డిఫరెంట్ డిజైన్‌తో కూడిన బ్లౌజ్, బంగారు బెల్ట్ తో వజ్రంలా మెరిసిపోతూ కనిపించిన సమంత… ఆ లుక్‌లో స్వభావాన్ని, చిలిపితనాన్ని, సాఫ్ట్నెస్‌ను చూపించడంలో విజయం సాధించింది. సింపుల్ హెయిర్ స్టైల్, సాఫ్ట్ మేకప్‌తో మోడరన్ లుక్ కు కొత్త నిర్వచనం ఇచ్చింది. స్టైలింగ్ నుంచి ఫొటోగ్రఫీ వరకు ప్రతి డీటెయిల్‌ను ఎంతో ఫినిషింగ్‌తో చూపించడం విశేషం.
ఇటీవల సమంత సినిమాలకు విరామం తీసుకున్నా.. ఆమె పర్సనల్ బ్రాండ్ హైప్ మాత్రం ఎప్పటికప్పుడు మినిమమ్ బజ్ లో ఉంది. తాను ఓ ఆరోగ్యకరమైన బ్రేక్ తీసుకుని, పూర్తిగా రీకవరీ తర్వాతే సినిమాలకు వస్తానని తెలిపిన సమంత.. ఇప్పుడు అలాంటి బ్రేక్ టైమ్ లో కూడా ఇలా స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఉర్రూతలూగిస్తోంది. ఈ ఫోటోషూట్‌లో సమంత చూపిన కాన్ఫిడెన్స్, కెమెరా ముందు ఉన్న ప్రెజెన్స్, ఆమె కెరీర్‌లో ఎంత ప్రొఫెషనల్‌గా తయారైందో చెప్పేలా ఉంది.
అంతేకాదు, ఈ ఫోటోస్‌కి ఆమె పెట్టిన క్యాప్షన్ "కలలో" కూడా ప్రేక్షకుల మనసుల్లో ఇంకిపోయేలా ఉంది. నిజంగా ఇది కలల ప్రపంచంలోంచి బయటకు వచ్చిన ఒక అందం అంటే అతిశయోక్తి కాదు. సమంత ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాల ఎంపికపై దృష్టి పెట్టినట్టు సమాచారం. బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయన్న వార్తలు ఉన్నాయి. త్వరలోనే ఓ నూతన ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అలాగే శుభం అనే ఒక కామెడీ హారర్ సినిమాను కూడా నిర్మిస్తోంది.
