సల్మాన్ ఖాన్ సినిమా నిర్మాతగా సమంత!
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ హై కాన్సెప్ట్ సూపర్ హీరో చిత్రానికి సన్నాహాకాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 6 March 2026 12:25 PM ISTసల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ హై కాన్సెప్ట్ సూపర్ హీరో చిత్రానికి సన్నాహాకాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ లాక్ అయింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో కాకుండా తక్కువ బడ్జెట్ తో సింపుల్ గా పూర్తి చేయాలన్నది సల్మాన్ కాన్సెప్ట్. భారీ బడ్జెట్ వెచ్చించి నిర్మాతలకు నష్టాలు తేవడం ఎ ంత మాత్రం ఇష్టం లేక సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్ సైన్ చేయడానికి ముందే ఈ కండీషన్ పెట్టారు. ఈ చిత్రాన్నిటాలీవుడ్ అగ్రగామి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, రీల్ లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించడం విశషం.
అయితే ఈ సినిమా నిర్మాణంలో సమంత కూడా భాగస్వామి గా చేరుతుందని సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.భారీ బడ్జెట్ సినిమా కాదు కాబట్టి సామ్ తన వంతు పెట్టుబడిగా కొంత పెడతానని మైత్రీతో ఒప్పందం చేసుకుందని వినిపి స్తోంది. ఇప్పటికే సమంతా ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో సినిమాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. కంటెంట్ ఓరియేంటెడ్ సినిమాల్ని యువనటీనటులతో నిర్మిస్తూ ప్రోత్సహిస్తుంది. తొలి ప్రయత్నంగా `శుభమ్` అనే చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలందుకుంది.
ప్రస్తుతం తానే ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న `మా ఇంటి బంగారం` అనే మరో చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతోనే సమంత కంబ్యాక్ అవుతోంది. ఇదే సమయంలో బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరును అమ్మడు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత రాజ్ నిడిమోరు దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం సల్మాన్ ఖాన్ దే కావడం విశేషం. అలా భర్త సహకారం కూడా సమంతకు లభించడంతో ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నట్లు తెలుస్తుంది.
బడ్జెట్ కు సంబంధించిన వ్యవహారాలు కూడా రాజ్ అండ్ డీకే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆ బాధ్యతలు సల్మాన్ ఖాన్ దర్శకులకే అప్పగించారు. మైత్రీ- రీల్ లైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ అన్నవి దర్శకులు అడిగినంత బడ్జెట్ సమకూర్చడమే వాళ్ల పని. నిర్మాణ పరంగా ఆ రెండు నిర్మాణ సంస్థలు ఎక్కడా రాజీ పడేవి కాదు. ఎన్ని కోట్లు అయినా తెచ్చి పెట్టగల సంస్థలు. అలాంటి నిర్మాణ సంస్థలతో సమంత ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ ఒప్పందం చేసుకోవడం ఆసక్తికరం. అయితే ఈ మూడు సంస్థలు ఎంత పర్సంటేజ్ చొప్పున పెట్టుబడి పెడుతున్నాయి. అన్నది క్లారిటీ రాలేదు. తొలుత ట్రాలాలా భాగస్వామ్యంలో లేదు కాబట్టి రెండు సంస్థలు 50-50 షేర్ లో పెట్టుబడి పెట్టేవారు. కానీ ఇప్పుడు ట్రాలాలా చేరింది కాబట్టి వాటా లెక్కలు తేలాల్సి ఉంది.
