సమంత ఫ్యాన్స్‌కి ఊరట కలిగించే వార్త..!
హీరోయిన్ సమంత సినిమాలు, సిరీస్‌లు పెద్దగా రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 26 Jun 2025 1:49 PM ISTహీరోయిన్ సమంత సినిమాలు, సిరీస్‌లు పెద్దగా రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ రెగ్యులర్‌గా సినిమాలు, సిరీస్‌లను చేయమని పదే పదే కోరుతున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఫ్యాన్స్ కోరుకున్నట్లు సినిమాలను విడుదల చేయడంలో విఫలం అవుతుంది. సమంత అనారోగ్య కారణాల వల్ల ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ సమయంలో సినిమాల షూటింగ్స్ జరగక పోవడం వల్ల ఇప్పుడు ఆమె నుంచి సినిమాలు, సిరీస్‌లు రావడం లేదు. అయితే రాబోయే రోజుల్లో ఆమె నుంచి రెగ్యులర్‌గా సినిమాలు, సిరీస్‌లు వస్తాయనే నమ్మకంతో కొందరు ఉన్నారు. కానీ సమంత గతంలో మాదిరిగా వరుస సినిమాల్లో నటించడం లేదు అనేది కాస్త ఇబ్బంది కలిగించే విషయం.
సమంత ఫ్యాన్స్‌తో పాటు హిందీ ఓటీటీ ప్రేక్షకులు గత కొన్ని నెలలుగా 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. షూటింగ్ సైతం కొంత మేరకు జరిగింది. కానీ యూనిట్‌లో కొందరు ప్రొడక్షన్ టీం మెంబర్స్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు వచ్చాయి. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు చిత్ర నిర్మాణంను మధ్యలో నిలిపేసింది. యూనిట్ సభ్యుల్లో ఎవరు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు అనే విషయాన్ని గుర్తించి విచారించేందుకు ఇన్నాళ్ల సమయం తీసుకున్నారు. తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుందా లేదా అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
తాజాగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే లు ఒక ప్రకటన విడుదల చేశారు. రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్ పునః ప్రారంభించే సమయం వచ్చింది అంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇన్‌డోర్ షూట్ పూర్తి అయింది. అతి త్వరలోనే వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఔట్ డోర్ షూటింగ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. యాక్షన్ సన్నివేశాల కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో వెబ్ సిరీస్ ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ వెబ్ సిరీస్ కంటెంట్ ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ దర్శక ద్వయం నుంచి వచ్చిన సిరీస్‌లకు మంచి స్పందన వచ్చింది. అందుకే ఈ వెబ్ సిరీస్ కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
సమంత ఫ్యాన్స్ ఈ వార్త కచ్చితంగా కాస్త ఊరట కలిగించే విషయం అనడంలో సందేహం లేదు. ఆమె ఇటీవల శుభం అనే సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఆ సినిమాలో సమంత కూడా కనిపించింది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో హర్రర్ కామెడీ సినిమాగా వచ్చిన ఆ సినిమాకు సమంత వల్ల మంచి బిజినెస్ జరిగింది. సమంత సినిమా కావడంతో ప్రేక్షకులు థియేటర్‌లో, ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపించారు. సమంత నుంచి సినిమాలు కూడా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె నుంచి సినిమా ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ఈ ఏడాదిలో సమంత ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర పడే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది.
