Begin typing your search above and press return to search.

'ఎంత గొప్ప ప్రారంభం ఇది'.. రాజ్ భుజంపై సామ్..

ఆ తర్వాత ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ టైమ్ లో ఉన్నప్పుడు కొన్ని పిక్స్ ను పోస్ట్ చేయగా, అందులో సామ్, రాజ్ సెల్ఫీ ఉంది.

By:  Tupaki Desk   |   14 May 2025 12:11 PM
ఎంత గొప్ప ప్రారంభం ఇది.. రాజ్ భుజంపై సామ్..
X

స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వాటిపై ఇప్పటి వరకు అటు సామ్ గానీ.. ఇటు రాజ్ గానీ ఏ సందర్భంలో కూడా రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఎప్పటికప్పుడు కలిసే కనిపిస్తున్నారు.

సమంత నిర్మించిన తొలి మూవీ శుభం రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందు తిరుమల సమంత వెళ్లగా ఆమెతో రాజ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ టైమ్ లో ఉన్నప్పుడు కొన్ని పిక్స్ ను పోస్ట్ చేయగా, అందులో సామ్, రాజ్ సెల్ఫీ ఉంది.

ఇది చాలా కష్టమైన ప్రయాణం, కానీ ఇక్కడి వరకు చేరుకున్నాం, కొత్త ఆరంభాలు అంటూ రాజ్ తో సెల్ఫీతో పాటు మరికొన్ని పిక్స్ ను షేర్ చేశారు. దీంతో రాజ్ విషయంలో సమంత క్లారిటీ ఇచ్చేశారని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు మరోసారి సామ్ పోస్ట్ చేసిన పిక్స్ హాట్ టాపిక్ గా మారాయి.

శుభం మూవీ టీమ్ తో పాటు రాజ్ తో తీసుకున్న ఫోటోస్ షేర్ చేశారు. శుభం మూవీని మాతో కలిసి చూసి, అనుభూతి చెందినందుకు ధన్యవాదాలు, ఎంత గొప్ప ప్రారంభమంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే రాజ్ భుజంపై సమంత తల వాల్చి తీసుకున్న పిక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీంతో నెటిజన్లు మళ్లీ కామెంట్స్ పెడుతున్నారు. పిక్స్ బాగున్నాయని మేడమ్ అని చెబుతున్నారు. శుభం మూవీకి నిర్మాతగా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అదే సమయంలో రాజ్, సామ్ ఉన్న పిక్ ను వైరల్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే వారిద్దరూ కలిసి పలు ప్రాజెక్టులకు గాను వర్క్ చేశారు.

ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ల కోసం సమంత, రాజ్ పని చేశారు. ఇప్పుడు ఆయనతో రక్త్ బ్రహ్మాండ్- ది బ్లడీ కింగ్ డమ్ లో వర్క్ చేస్తున్నారు. చెన్నై సూపర్ ఛాంప్స్ పికిల్ బాల్ టీమ్ కు ఇద్దరూ పార్టనర్స్ గా ఉన్నారు. అయితే రాజ్.. తిరుపతికి చెందిన వ్యక్తే. ఏదేమైనా ఇప్పుడు సామ్, రాజ్ పిక్స్ మాత్రం ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి.