రాజ్ నిడిమోరు వైఫ్ సామ్ రిలేషన్‌ని కన్ఫర్మ్ చేసిందా?
`ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్‌ల దర్శకుడు రాజ్ నిడిమోరు, క్రేజీ హీరోయిన్ సమంత గురించి గత కొంత కాలంగా వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 15 May 2025 12:32 PM IST`ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్‌ల దర్శకుడు రాజ్ నిడిమోరు, క్రేజీ హీరోయిన్ సమంత గురించి గత కొంత కాలంగా వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నెట్టింటీ జోడీ వైరల్ అవుతున్న నేపథ్యంలో సమంత గెస్ట్ రోల్‌లో నటించి నిర్మించిన `శుభం` మూవీ సక్సెస్ సందర్భంగా చిత్ర బృందం, రాజ్‌నిడిమోర్‌తో కలిసి ఉన్న ఫొటోలని సమంత నెట్టింట షేర్ చేసింది. రాజ్ నిడిమోర్ భుజంపై సామ్ తలని వాల్చి ``శుభం`తో అద్భుతమైన ప్రయాణం మదలైంది` అంటూ ఇన్ స్టాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటువంటి సమయం లో దర్శకుడు రాజ్ నిడిమోరు సతీమణి శ్యామాలి స్పందించారు. ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. `నా గురించి ఆలోచించి, విని మాట్లాడే వారితో పాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసేవారందరికీ ప్రేమ, ఆశీస్సులు పంపుతున్నా` అంటూ ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు.
గత కొంత కాలంగా ఇన్‌స్టాలో ఎలాంటి పోస్ట్‌లు షేర్ చేయని శ్యామాలి ఉన్నట్టుండి ఇలా పోస్ట్‌ని షేర్ చేయడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. సైకాలజీ చదువుకున్న శ్యామాలి బాలీవుడ్ దర్శకులు ఓం ప్రకాష్ మిశ్రా, విశాల్ భరద్వాజ్‌ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. `రంగ్‌దే బసంతి`, `ఓంకార` వంటి సినిమాలకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వర్క్ చేశారు. 2015లో దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం జరిగింది. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. వివాహం తరువాత రాజ్ నిడియోరు రూపొందించిన సిరీస్‌లు, సినిమాలకు శ్యామాలి క్యాస్టింగ్‌లో సహాయం అందించింది.
అయితే గత కొంత కాలంగా శ్యామాలి,దర్శకుడు రాజ్ నిడిమోరు విడిపోతున్నారంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్ స్టా పోస్ట్‌తో సామ్, రాజ్‌నిడిమోరుల బంధాన్ని కన్ఫర్మ్‌చేసిందని అంతా అవాక్కవుతున్నారు. `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` సమయంలో సమంతతో రాజ్ నిడిమోరుకు పరిచయం ఏర్పడింది. ఆ తరువాత `సీటాడెల్ హనీబన్నీ`లోనూ సమంత నటించడం తెలిసిందే. తాజాగా సామ్ నిర్మించిన `శుభం` మూవీకి రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
