సమంత - రాజ్ ఫోటోలు వైరల్.. వెంటనే స్పందించిన శ్యామాలి?
తాజా ఘటనపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఆమెకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు గాసిప్స్ నిజం అనుకుని ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 9 July 2025 9:10 PM ISTబాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత మధ్య రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈ వ్యవహారాన్ని మరోసారి వెలుగులోకి తీసుకువచ్చాయి. రాజ్‌తో కలిసి దిగిన పిక్స్‌ను పెట్టిన కాసేపటికే రాజ్ భార్య శ్యామాలి పెట్టిన ఇన్‌స్టా స్టోరీ ఈ విషయాన్ని మరో కోణంలో హైలెట్ చేసింది.
శ్యామాలి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “ఏ మతమైనా చెప్పేది ఒక్కటే.. మన పనులతో ఇతరులను గాయపరచవద్దు. ఇదే జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం” అంటూ ఓ తాత్విక మెసేజ్‌ను షేర్ చేశారు. ఇది సింపుల్ మెసేజ్ అయినా.. సమంత రాజ్ పిక్స్ బయటకి వచ్చిన తర్వాత పెట్టిన ఆ విధంగా ఉండటంతో, దీనిపై నెటిజన్లలో చర్చ మొదలైంది. ఆమె ఈ పోస్ట్ ద్వారా ఏదైనా చెప్పాలనుకుందా? లేక ఉద్దేశపూర్వకంగా షేర్ చేశారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఇదే సమయంలో శ్యామాలి గతంలో పెట్టిన పోస్టులు కూడా మళ్లీ వైరల్ అవుతున్నాయి. “నమ్మకాన్ని ఒక్కసారి కోల్పోతే ఎంత ఖర్చు పెట్టినా తిరిగి పొందలేము”, “కాలమే సమాధానం చెబుతుంది” వంటి కామెంట్స్ అప్పట్లో కూడా చర్చకు దారితీశాయి. వాటికి ఇప్పుడు ఈ పోస్ట్ జత కావడంతో, ఆమె తన భావోద్వేగాన్ని ఈ విధంగానే పరోక్షంగా వ్యక్తపరిచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమంత రాజ్ మధ్య ఈ రూమర్స్ మొదలైనప్పటి నుంచి శ్యామాలి ప్రతి స్టోరీపై వివిధ కోణాల్లో చూస్తున్న నెటిజన్లు.. తాజా ఘటనపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఆమెకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు గాసిప్స్ నిజం అనుకుని ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ గాసిప్స్‌కు మరింత బలం చేకూర్చేలా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మంగళవారం సాయంత్రం రాజ్‌తో కలిసి దిగిన వెకేషన్ ఫోటోల్ని ఆమె స్వయంగా షేర్ చేయడం గమనార్హం.
రాజ్ నిడిమోరు, డీకే కలసి రూపొందించిన ‘ది ఫ్యామిలీ మాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లలో సమంత కీలక పాత్రలు పోషించారు. వృత్తిపరంగా వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నా.. ఇది వ్యక్తిగతంగా మారిందని గత కొంతకాలంగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల ‘శుభం’ అనే షార్ట్ ఫిల్మ్‌ను సమంత నిర్మించగా, దానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంపై రాజ్ గానీ, సమంత గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
