Begin typing your search above and press return to search.

సామ్, రాజ్.. ఆస్తిలో ఎవరు ఎక్కువ?

కోయంబత్తూరులో పెళ్లి సందడి ముగిసింది. ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు నెటిజన్ల దృష్టి వీరిద్దరి ఆస్తుల మీద పడింది.

By:  Tupaki Desk   |   2 Dec 2025 12:16 PM IST
సామ్, రాజ్.. ఆస్తిలో ఎవరు ఎక్కువ?
X

కోయంబత్తూరులో పెళ్లి సందడి ముగిసింది. ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు నెటిజన్ల దృష్టి వీరిద్దరి ఆస్తుల మీద పడింది. ఇద్దరూ తమ తమ రంగాల్లో బాగా సంపాదించినవారే. సొంత కాళ్లపై నిలబడి సక్సెస్ అయినవారే. అయితే వీరిద్దరిలో ఆర్థికంగా ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. బయట వినిపిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది.

సాధారణంగా సినిమా సెలబ్రిటీల పెళ్లి అంటేనే కోట్ల వ్యవహారం. కానీ సమంత, రాజ్ చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. బయట ఆర్భాటం లేకపోయినా, వారి బ్యాంక్ బ్యాలెన్స్ లు మాత్రం గట్టిగానే ఉన్నాయట. బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇద్దరి ఆస్తులు కలిపితే దాదాపు 200 కోట్ల వరకు ఉంటాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

కానీ అసలు విషయానికి వస్తే.. ఈ మొత్తం ఆస్తిలో ఎవరి వాటా ఎంత? సాధారణంగా భర్త ఆస్తి భార్య కంటే కాస్త ఎక్కువ ఉండటం చూస్తుంటాం. కానీ ఈ కాంబినేషన్ లో మాత్రం సీన్ రివర్స్ అని అంటున్నారు. ఆస్తుల విషయంలో భర్త కంటే సమంతనే ముందంజలో ఉన్నట్లు సోషల్ మీడియాలో లెక్కలు వేస్తున్నారు. ఫైనాన్షియల్ డామినేషన్ క్లియర్ గా సామ్ వైపే కనిపిస్తోంది.

ఆ అంచనాల ప్రకారం.. 2025 నాటికి సమంత ఆస్తి విలువ దాదాపు 110 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చట. దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగడం, భారీ రెమ్యునరేషన్లు, బ్రాండ్ ఎండార్స్ మెంట్లు ఆమె సంపాదనను పెంచాయి. వీరిద్దరి మొత్తం ఉమ్మడి ఆస్తుల్లో ఆమె వాటానే 50 శాతానికి పైగా ఉందట.

ఇక రాజ్ నిడమూరు విషయానికి వస్తే, అతని ఆస్తి విలువ సుమారు 85 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్, ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్నా, కమర్షియల్ యాడ్స్ వంటి అదనపు ఆదాయం ఉండదు కాబట్టి, సమంతతో పోలిస్తే ఆయన ఆస్తి తక్కువగానే కనిపిస్తోంది. ఈ లెక్కల ప్రకారం రాజ్ కంటే సామ్ ఆస్తులు దాదాపు 29 శాతం ఎక్కువ అని టాక్.

ఒక హీరోయిన్ తన భర్త కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉండటం అనేది ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరిగే విషయం. ఇది సమంత తన కెరీర్ ను ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుందో చెప్పకనే చెబుతోంది. ఏది ఏమైనా, వీరిద్దరూ ఆర్థికంగా ఫుల్ గా సెటిల్ అయిన జంటే. డబ్బు మాట పక్కన పెడితే, ఒకరి టాలెంట్ ను మరొకరు గౌరవించుకుంటూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.