Begin typing your search above and press return to search.

రాజ్ నిడిమోరు - స‌మంత‌ బిగ్ స్టెప్‌కు రెడీ?

ఏ బంధం ఎలా ముడిప‌డుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరంటారు. స‌మంత విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోందా? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి

By:  Tupaki Desk   |   15 May 2025 1:51 PM IST
రాజ్ నిడిమోరు - స‌మంత‌ బిగ్ స్టెప్‌కు రెడీ?
X

ఏ బంధం ఎలా ముడిప‌డుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరంటారు. స‌మంత విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోందా? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన స‌మంత గ‌త కొంత కాలంగా ఒంట‌రిగా ఉంటోంది. అయితే త‌ను `ది ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ డైరెక్ట‌ర్‌ల‌లో ఒక‌రైన రాజ్ నిడిమోరుతో రిలేష‌న్‌లో ఉంటోంద‌ని గ‌త కొంత కాలంగా వ‌రుస క‌థ‌నాలు నెట్టింట వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ స‌మంత తొలి సారి నిర్మాత‌గా మారి నిర్మించిన `శుభం` మూవీకి రాజ్ నిడిమోరు క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

దీంతో వీరిద్ద‌రిపై ఊహాగానాలు మ‌రింత‌గా పెరిగాయి. దానికి మ‌రింత ఆజ్యం పోస్తూ స‌మంత `శుభం` స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా టీమ్‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులిచ్చింది. అదే స‌మ‌యంలో రాజ్ నిడిమోరు భుజంపై త‌ల‌వాల్చి ఆస‌క్తిక‌రంగా పోస్ట్ పెట్టింది. ``శుభం`తో అధ్భుత‌మైన ప్ర‌యాణం మొద‌లైంది` అంటూ ఆస‌క్త‌క‌రంగా స్పందించింది. ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ కావ‌డంతో సామ్‌, రాజ్ నిడిమోరు బంధాన్ని క‌న్ఫ‌ర్మ్ చేస్తూ రాజ్ నిడిమోరు వైఫ్ శ్యామాలి ఇన్ స్టా వేదిక‌గా పోస్ట్ చేసింది.

`నా గురించి ఆలోచించి, విని మాట్లాడే వారితో పాటు న‌న్నుక‌లిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసేవారంద‌రికీ ప్రేమ‌, ఆశీస్సులు పంపుతున్నా` అని ఇన్‌స్టాలో షేర్ చేయ‌డంతో స‌రికొత్త చ‌ర్చ మొద‌లైంది. ఈ చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే సామ్‌, రాజ్ నిడిమోరుల‌కు సంబంధించిన షాకింగ్ విష‌యాన్ని `పింక్ విల్ల సౌత్‌` తాజాగా వెల్ల‌డించింది. నెట్టింట గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టుగానే రాజ్ నిడిమోరు, స‌మంత త్వ‌ర‌లో ఒక్క‌టి కాబోతున్నార‌ని, ఇద్ద‌రు క‌లిసి ఉండేందుకు ప్రాప‌ర్టీస్‌ని వెతుకుతున్నార‌ని సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

అంతే కాకుండా త్వ‌ర‌లో వీరిద్ద‌రు బిగ్‌స్టెప్ తీసుకోబోతున్నార‌ని, ఇద్ద‌రు క‌లిసి ఉండ‌టానికి కావాల్సిన ప్రాప‌ర్టీని ప్ర‌స్తుతం వెతికే వేట‌లో ప‌డ్డారని పేర్కొంది. ఇప్ప‌టికే రాజ్ నిడిమోరు 2022లో భార్య శ్యామాలితో విడాకులు తీసుకున్నాడ‌ని, వీరిద్ద‌రికి ఎలాంటి సంతానం లేద‌ని, వీరికి పాప ఉంద‌న్న ప్ర‌చారంలో నిజం లేద‌ని పేర్కొంది. అంతే కాకుండా సామ్‌, రాజ్ నిడిమోరు ఇద్ద‌రూ రిలేష‌న్‌షిప్ లో భాగంగానే `పిక్‌లేబిల్‌` పేరుతో స్పోర్ట్స్ రంగంలోకి అడుగుపెట్టార‌ని వెల్ల‌డించింది. దీంతో ప్ర‌స్తుతం సామ్‌, రాజ్ నిడిమోరుల రిలేష‌న్‌షిప్ కు సంబంధించిన న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.