'శుభం' టీమ్ తో తిరుమలకు సామ్.. ఆ డైరెక్టర్ కూడా వెళ్లారేంటి?
తాజాగా వీరిద్దరూ కలిసి తిరుమలలో కనబడడం డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా సమంత, రాజ్ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఆ వార్తలకు చెక్ పడదు.
By: Tupaki Desk | 19 April 2025 11:06 PM ISTస్టార్ హీరోయిన్ సమంత.. ఓవైపు నటిగా.. మరో వైపు నిర్మాతగా బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్.. ఓ రేంజ్ లో అదరగొట్టారని చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో తన టాలెంట్ ఏంటో చూపించారు. సిరీస్ విషయంలో కష్టానికి ప్రతిఫలం అందుకున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు సమంత. సిరీస్ లో మహారాణి రోల్ లో ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సిరీస్ స్ట్రీమింగ్ కూడా కానుంది. అదే సమయంలో మా ఇంటి బంగారం మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు సమంత. నటిస్తూనే.. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు.
దాంతోపాటు ఇప్పుడు తన బ్యానర్ పై రూపొందించిన శుభం రిలీజ్ కు సిద్ధమవుతోంది. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ నేపథ్యంలో తాజాగా శుభం మూవీ టీమ్ తో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు సామ్. శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించి వెంకన్నను ప్రార్థించారు!
అయితే తిరుమలలో సమంతతోపాటు డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకున్నారని జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
దీనిపై ఇప్పటి వరకు సామ్ గానీ రాజ్ గానీ రెస్పాండ్ అవ్వలేదు. ఆ మధ్య వరుస ఈవెంట్స్ లో ఇద్దరూ కలిసి కనిపించారు. పికిల్ బాల్ టోర్నమెంట్ లో ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ సమయంలో ఎక్కువగా సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత వివిధ బర్త్ డే పార్టీల్లో ఇద్దరూ కలిసి మెరిశారు.
తాజాగా వీరిద్దరూ కలిసి తిరుమలలో కనబడడం డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా సమంత, రాజ్ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఆ వార్తలకు చెక్ పడదు. అయితే రాజ్ నిడిమోరు తెలుగు వారేనన్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతికి చెందిన ఆయనకు ఇప్పటికే పెళ్లి అయింది. మరి సామ్, రాజ్ డేటింగ్ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
