అందుకే సమంతను సెలెక్ట్ చేసుకున్నా
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత రీసెంట్ గానే శుభం అనే సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 17 May 2025 12:36 PM ISTటాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత రీసెంట్ గానే శుభం అనే సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే శుభం మూవీకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది.
గతంలో వీరిద్దరూ కలిసి ఫ్యామిలీ మ్యాన్ సీజన్2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ కోసం వర్క్ చేశారు. సమంత మయోసైటిస్ అనే సమస్యతో బాధ పడుతున్నప్పుడు కూడా వీరిద్దరూ సమంతకు ఎంతో సాయం చేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రాజ్-డికె సిటాడెల్ లో సమంతను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని అడగ్గా, సమంతకు యాక్షన్ సీన్స్ కూడా చేసే పొటెన్షియల్ ఉండటం వల్లేనని వారు వెల్లడించారు.
ఆ క్యారెక్టర్ కు చాలా టాలెంటెడ్ యాక్టర్ కావాలనుకుని సమంతను సెలెక్ట్ చేసుకుని ఆమెను యాక్షన్ స్టార్ గా తీర్చిదిద్దామని చెప్పిన రాజ్, ఆమెను యాక్షన్ స్టార్ గా మలిచినందుకు గర్విస్తున్నామని, సమంత ఆ క్యారెక్టర్ ను చేయగలదని ఎంతో నమ్మి, ఆమెను దృష్టిలో పెట్టుకునే ఆ క్యారెక్టర్ ను రాసుకున్నామని, హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమెను హోల్డ్ లో పెట్టడం ఇష్టంలేకనే ఆమెకు సపోర్ట్ చేస్తూ, ఆమె హెల్త్ సెట్ అయ్యేవరకు వెయిట్ చేశామని రాజ్ అన్నారు.
సమంత సినిమా కోసం పడే తపన, తాను కమిట్ అయిన క్యారెక్టర్ కోసం ఏం చేయాలనేది ఆమెకు బాగా తెలుసని, టీమ్ మొత్తం ఆమెను నమ్మిందని, ఆ బాటలోనే తాము కూడా సమంతను నమ్మామని రాజ్ చెప్పారు. అప్పటికే సమంతతో ఫ్యామిలీ మ్యాన్2 చేయడం వల్ల ఆమె వర్క్ ఏంటో తమకు ఓ ఐడియా ఉందని, ఆమె కోసం వెయిట్ చేయడం కరెక్టే అనిపించిందని డీకే తెలిపారు.
ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో సమంత ఎన్నో ప్రశంసలు పొందింది. రాజ్,డికె ఆమెకు అందించిన సపోర్ట్ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. దానికి తోడు సమంత హెల్త్ బాలేనప్పుడు కూడా రాజ్-డీక్ ఆమెకు ఎంతో మద్దుతిస్తూ, తను కోలుకునే వరకు వెయిట్ చేసి సిటాడెల్ సిరీస్ లో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ సిరీస్ అనుకున్న ఫలితాల్ని అందుకోలేకపోయింది.
