Begin typing your search above and press return to search.

సినిమా అయినా, యాడ్ అయినా స‌మంత రూటే వేరు

అయితే స‌మంత ఇప్పుడు ఓ వీడియో ద్వారా ఆడియ‌న్స్ ముందుకు వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   17 July 2025 2:07 PM IST
సినిమా అయినా, యాడ్ అయినా స‌మంత రూటే వేరు
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంతను తెలుగు ఆడియ‌న్స్ చాలా మిస్ అవుతున్నారు. స‌మంత నుంచి ఖుషి త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా వ‌చ్చింది లేదు. మ‌యోసైటిస్ కార‌ణంగా సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న స‌మంత రీఎంట్రీ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌లేదు. రీసెంట్ గా శుభం సినిమాతో నిర్మాత‌గా మారి అందులో చిన్న క్యామియో చేశారు కానీ హీరోయిన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ అయితే చేయ‌లేదు.

అయితే స‌మంత ఇప్పుడు ఓ వీడియో ద్వారా ఆడియ‌న్స్ ముందుకు వ‌చ్చింది. అలా అని అది సినిమాకు సంబంధించిన వీడియో కాదు. ప్రైమ్ వీడియో కోసం స‌మంత స‌రదాగా ఓ ప్రోమో లో న‌టించ‌గా ఆ ప్రోమో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఈ వీడియో సినిమాకు సంబంధించింది కాక‌పోయినా, అందులో ఉన్న డ్రామా, కామెడీ దాని గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

ఆ వీడియోలో స‌మంత క్యాజువ‌ల్ గా త‌న కారావ్యాన్ లో రిలాక్స్ అవుతూ ఏం చూడాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏ జాన‌ర్ సినిమా చూడాలా అని ఆలోచిస్తూ, స‌డెన్ గా థ్రిల్ల‌ర్ సినిమాలు డిఫ‌రెంట్ గా ఎలా ప్ర‌భావిత‌మౌతాయి? అలా ప్రైమ్ కు సంబంధించిన కేట‌లాగ్ మొత్తం హైలైట్ అయ్యేలా యాడ్ ను రూపొందించారు. వీడియోలో స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మ్యాన్ గురించి ప్ర‌స్తావించారు.

అయితే వీడియో మొత్తం మీద హైలైట్ అయింది స‌మంత చలాకీద‌నం, అల్ల‌రి, త‌న స్క్రీన్ ప్రెజెన్స్. వీడియోలో స‌మంత పాత‌కాల‌పు వేష‌ధార‌ణతో ఓ సీన్ నుంచి మ‌రో సీన్ కు మారుతూ ఉంటుంది. ఈ వీడియో చాలా భారీగా ప్లాన్ చేసిందేమీ కాదు, ఇంకా చెప్పాలంటే భారీ షూటింగ్, భారీ రేంజ్ లో వాయిస్ ఓవ‌ర్, మెసేజ్ కూడా లేకుండా ప్రైమ్ అందించే వాటి గురించి చాలా సింపుల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ యాడ్ లో స‌మంత‌ను చూశాక ఆమె చాలా క్యాజువ‌ల్ గా ఈ యాడ్ చేసిన‌ప్ప‌టికీ తానేంటో నిరూపించుకున్నార‌ని, స‌మంత త‌న‌దైన ముద్ర వేయడానికి ఆమెకు ఫుల్ లెంగ్త్ సినిమా ప‌న్లేద‌ని, కొన్ని నిమిషాల యాడ్ అయినా స‌రిపోతుంద‌ని ఆమె ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక స‌మంత సినిమాల విష‌యానికొస్తే ప్ర‌స్తుతం ఆమె ర‌క్త్ బ్ర‌హ్మాండ్ లో న‌టిస్తున్నారు.