Begin typing your search above and press return to search.

'శుభం' జర్నీ.. డైరెక్టర్ రాజ్ తో సామ్ ఫోటో వైరల్!

ప్రముఖ నటి సమంత.. హీరోయిన్ గా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 May 2025 6:14 PM
శుభం జర్నీ.. డైరెక్టర్ రాజ్ తో సామ్ ఫోటో వైరల్!
X

ప్రముఖ నటి సమంత.. హీరోయిన్ గా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించిన శుభం మూవీతో ప్రేక్షకుల ముందుకు మరికొద్ది రోజుల్లో రానున్నారు.

హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి తదితరులు నటించిన శుభం మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా, సామ్ తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. మే 9వ తేదీన ఆ సినిమా రిలీజ్ అవ్వనుండగా.. కొంతకాలంగా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.

కొన్ని పిక్స్ పోస్ట్ చేసి.. హార్ట్ ఫెల్ట్ మెసేజ్ రాసుకొచ్చారు. అదొక చాలా లాంగ్ రోడ్.. ఇక్కడ మనం స్ట్రాంగ్ న్యూ బిగినింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు సామ్. శుభం మూవీని ట్యాగ్ చేసి రిలీజ్ డేట్ ను గుర్తుచేసిన ఆమె.. క్రేజీ పిక్స్ పోస్ట్ చేయడం విశేషం. అందులో శుభం మూవీ క్లాప్ పిక్ కూడా ఉంది.

అదే సమయంలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన సమంత.. ఆయన సింగిల్ పిక్ కూడా యాడ్ చేయడం గమనార్హం. దీంతో ఇప్పుడు సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది స్పెషల్ పోస్ట్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే రాజ్, సామ్ వివాహం చేసుకోనున్నారని కొద్ది రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో సమంత.. రాజ్ పిక్స్ పోస్ట్ చేయడంతో ఆ మ్యాటర్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వైట్ అవుట్ ఫిట్స్ లో దిగిన పిక్స్ షేర్ చేయగా.. సూపర్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మేడమ్ సర్ మేడమ్ అంతే అని కొనియాడుతున్నారు. బ్యూటిఫుల్ ఫోటోస్ అని చెబుతున్నారు.

ఇక కెరీర్ విషయానికొస్తే.. శుభం మూవీతోపాటు మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తున్నారు సామ్. అందులో ఆమె నటిస్తున్నారు కూడా. అదే సమయంలో రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేస్తున్నారు. మహారాణి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి వరుస ప్రాజెక్టులతో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.