3 రోజులపాటు పూర్తిగా ఫోన్ కు దూరం.. సామ్ సైలెంట్ రిట్రీట్ ఇలా!
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 3 July 2025 11:28 AM ISTస్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. కొంతకాలంగా నెట్టింట ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటున్నారు అమ్మడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ తోపాటు క్రేజీ రీల్స్ షేర్ చూస్తూ ఆడియన్స్ ను, నెటిజన్లను ఫుల్ ఎంటర్టైన్ చేసున్నారు సమంత.
అదే సమయంలో మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత పాడ్ కాస్ట్ లో అనేక ఆరోగ్యపరమైన విషయాలు షేర్ చేసుకుంటున్నారు సామ్. తన వ్యక్తిగత ఆరోగ్య ప్రయాణం, జీవనశైలి మార్పుల గురించి ఎల్లప్పుడూ పారదర్శకంగా చెబుతూ వైరల్ గా మారుతున్నారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నారు.
ఫోన్ తో టాక్సిక్ రిలేషన్ షిప్ ను సమంత రీసెంట్ పాడ్ కాస్ట్ ఎపిసోడ్ లో రివీల్ చేశారు. తన లైఫ్ లో కష్టపడి నిర్మించుకున్న సమతుల్యతను అధిక ఫోన్ వాడకం ఎలా దెబ్బ తీసిందో పరోక్షంగా తెలిపారు. ఇప్పటికే చాలా సానుకూల మార్పులు చేశానని, తాను ఇప్పుడు డైలీ రొటీన్ తో సంతోషంగా ఉన్నానని సామ్ షేర్ చేశారు.
ఫోన్ వాడడాన్ని తగ్గించుకునేందుకు ట్రై చేశానని చెప్పిన సమంత.. అలా చేయాల్సిన అవసరం ఉందని తనకు తాను చెప్పుకుంటూనే ఉన్నానని తెలిపారు. రీసెంట్ గా మూడు రోజుల సైలెంట్ రిట్రీట్ లో ఫాల్ అయినట్లు చెప్పిన సామ్.. ఫోన్ తోపాటు బయట ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపి ఒక్కసారి షాక్ ఇచ్చారు.
ఫోన్ లేదని, కమ్యూనికేషన్ లేదని ఏ రకంగా కూడా ప్రపంచంతో సంబంధం లేదని తెలిపారు. అప్పుడు బ్రెయిన్ బాగా పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సైలెంట్ రిట్రీట్ ను ఫాలో అయ్యారా మేడమ్.. మీరు సూపర్ అని చెబుతున్నారు. ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని అడుగుతున్నారు.
ఇక సామ్ అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయానికొస్తే.. రీసెంట్ గా నిర్మాతగా తన డెబ్యూ మూవీ శుభంలో కనిపించారు. క్యామియో రోల్ లో మెప్పించారు. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీ చేస్తున్నారు. మరోవైపు, యాక్షన్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్ డమ్ తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2025లోనే ఆ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.
