Begin typing your search above and press return to search.

'ఊ అంటావా' పాట చేయోద్ద‌ని స‌ల‌హాలిచ్చారు!

కార‌ణం ఏంటి? అని అడిగితే చాలా ర‌కాల రీజ‌న్స్ చెప్పా రంది. కానీ స‌మంత త‌న‌ని తనెప్పుడు హాట్ గాళ్ గా ఊహించుకోలేదంది.

By:  Tupaki Desk   |   10 May 2025 10:00 PM IST
ఊ అంటావా పాట చేయోద్ద‌ని స‌ల‌హాలిచ్చారు!
X

స‌మంత పెర్పార్మెన్స్ చేసిన 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ పాట' ప్ర‌పంచాన్ని ఏ రేంజ్లో ఊపే సిందో చెప్పాల్సిన ప‌నిలేదు. సినీ ప్రేక్ష‌కుడు నుంచి క్రికెటర్ వ‌ర‌కూ అంతా ఆ పాట‌కు ఫిదా అయ్యారు. స‌మంత మాస్ స్టెప్పులకు అభిమానులుగా మారిపోయారు. స‌మంత తొలిసారి అలా 'పుష్ప' కోసం ఐటంగా గాళ్ గా మారింది. ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా? ద‌ర్శ‌కుడు సుకుమార్-హీరో బ‌న్నీ స‌మంత అయితే బాగుంటుంద‌ని ఏరికోరి మ‌రీ ఎంపిక చేసారు.

స‌మంత ఎంట్రీతో ఆ పాట‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఏర్పడింది. అయితే ఈ పాట‌లో న‌టించొద్ద‌ని స‌మం త‌కు చాలా మంది చాలా ర‌కాల స‌ల‌హాలు ఇచ్చారుట‌. కార‌ణం ఏంటి? అని అడిగితే చాలా ర‌కాల రీజ‌న్స్ చెప్పా రంది. కానీ స‌మంత త‌న‌ని తనెప్పుడు హాట్ గాళ్ గా ఊహించుకోలేదంది. అలాంటి స‌మ‌యంలో పాట అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు చేయ‌డం స‌వాల్ గా అని పించిందన్నారు. సెట్ లోకి అడుగు పెడుతు న్న‌ప్పుడు కంగారుగా అనిపించిందిట‌.

అయినా ధైర్యంగా పాట పూర్తి చేసిన‌ట్లు తెలిపింది. మ‌ళ్లీ భ‌విష్య‌త్ లో ఇలాంటి పాట‌లు చేస్తాన‌నుకోవ‌డం లేద‌ని వెల్ల‌డించింది. దీంతో ఐటం పాట‌ల్లో స‌మంత న‌టించ‌డం అదే తొలిసారి ...చివ‌రిసారి అని మ‌రో సారి క్లారిటీ ఇచ్చింది. గ‌తంలోనే మ‌ళ్లీ ఐటం పాట‌ల్లో న‌టించ‌న‌ని స‌మంత తెలిపింది. హీరోయిన్ గా మొద లైన త‌న ప్ర‌యాణం అలాగే ముగించాల‌నుకుంటున్న‌ట్లు తెలిపింది.

ప్ర‌స్తుతం స‌మంత బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. ముంబైలో ఉంటూ హిందీ సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది. అయితే ఛాన్సులు మాత్రం రావ‌డం లేదు. స‌మంత కన్నా వెన‌కెళ్లిన వారు అందుకుటున్నారు గానీ సామ్ మాత్రం ఇంకా ఏ సినిమాకు సైన్ చేయ‌లేదు.