చై-సామ్ .. మాజీలు కలిసే శుభతరుణం?
అక్కినేని నాగచైతన్య- సమంత జంట ప్రేమ పెళ్లి, విడాకుల గురించి తెలిసినదే. లైఫ్ చాలా గమ్మత్తయినది.
By: Tupaki Desk | 15 Jun 2025 12:58 PM ISTఅక్కినేని నాగచైతన్య- సమంత జంట ప్రేమ పెళ్లి, విడాకుల గురించి తెలిసినదే. లైఫ్ చాలా గమ్మత్తయినది. అది తిరిగి అందరినీ సర్కిల్ లో ఓ చోటికే చేరుస్తుంది. దీని ప్రకారం.. చై- సామ్ విడిపోయిన తర్వాత మళ్లీ కలిసే తరుణం వచ్చింది. ఇప్పుడు సర్కిల్‌లో ఓ చోటికి చేరే వేళాయెను.
ఇంత కాన్ఫిడెంట్‌గా దీని గురించి ప్రస్థావించడానికి కారణం లేకపోలేదు. సమంత - నాగచైతన్య జంటగా నటించిన బ్లాక్ బస్టర్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ `ఏమాయ చేశావే`ను చాలా కాలం తర్వాత రీమాష్టర్ చేసి రీరిలీజ్ చేస్తుండడం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చై- సామ్ తిరిగి కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రంతోనే సమంత కథానాయికగా ఆరంగేట్రం చేసింది. గురూ గౌతమ్ మీనన్ సామ్ ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. తనవైన క్యూట్ లుక్స్ తో యువతరాన్ని మాయ చేసింది ఈ బ్యూటీ. ఇక ఇదే చిత్రంతో రొమాంటిక్ లవర్ బోయ్ గా ఇమేజ్ వచ్చింది చైతన్యకు. అందుకే ఈ ఇద్దరూ ఇలాంటి ఒక గొప్ప సందర్భం కోసం కలిసి రావాలి. ఏమాయ చేసావే సినిమాని ప్రమోట్ చేయాలి. కానీ అది జరుగుతుందా? అంటే చెప్పలేం. ఇద్దరూ కలిసి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తే చాలా బాగుంటుందని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. చైతూ వేరొకరిని పెళ్లాడి సెటిలయ్యాడు. ఇప్పుడు సమంతపైనా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. సమంత సోషల్ మీడియాల్లో నిరంతర క్రిప్టిక్ పోస్టులు ఆసక్తిని పెంచుతున్నాయి. `ఏ మాయ చేశావే` చిత్రాన్ని ఈ జోడీ ఎలా ప్రచారం చేయబోతోందో వేచి చూడాలి.
