ఒకే వివాహ వేడుకలో మాజీ జంట!
ఆ రిసెప్షన్ కు నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వేడుకలో పాల్గొన్నారు.
By: M Prashanth | 3 May 2026 12:36 PM ISTస్టార్ ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ కూతురు సిమ్రాన్ మ్యారేజ్ రిసెప్షన్ టాలీవుడ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఆ వేడుక సినీ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. అయితే ఆ ఈవెంట్ లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం గతంలో విడిపోయిన నాగచైతన్య, సమంత ఒకే కార్యక్రమానికి హాజరు కావడమే.
ఆ రిసెప్షన్ కు నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. గతంలో విడిపోయిన ఆ ఇద్దరు ఒకే ఈవెంట్ లో కనిపించడం అక్కడికి వచ్చిన అతిథుల్లో ఆసక్తి రేకెత్తించింది. అందుకు సంబంధించిన విజువల్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వేడుకలో సమంత పర్పుల్- గోల్డ్ కలర్ చీరలో ఎంతో ఎలిగెంట్ గా మెరిశారు. ఆమె స్టైలింగ్, సింపుల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఎప్పటిలాగే చిరునవ్వుతో కనిపిస్తూ కెమెరాలకు పోజులిచ్చారు. రాజ్ నిడిమోరు సూట్ లో క్లాసీగా కనిపిస్తూ సమంతతో కలిసి స్టేజ్ పై ఫోటోలకు పోజులిచ్చారు. వధూవరులతో కలిసి వారు సరదాగా మాట్లాడుకుంటూ, కూల్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేశారు.
ఇక నాగచైతన్య సూట్ లో ఫుల్ స్మార్ట్‌గా కనిపించగా, శోభిత ధూళిపాళ బ్లూ-పింక్ కలర్ చీరలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఆ జంట కూడా స్టేజ్ పై వధూవరులతో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఆ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున, అమల కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించడం విశేషంగా నిలిచింది.
అయితే అదే ఈవెంట్ కు టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం మొత్తం సందడి సందడిగా సాగింది. సెలబ్రిటీల రాక, బ్యాక్ గ్రౌండ్ లో కూల్ మ్యూజిక్, ఫోటో సెషన్లు వేడుకకు మరింత అందాన్ని చేర్చాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి.
మొత్తానికి, నాగచైతన్య- సమంత విడిపోయిన తర్వాత తమ జీవితాల్లో ముందుకు సాగుతున్న సమయంలో ఒకే కార్యక్రమంలో కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అందుకే ఆ ఈవెంట్ లో వీరిద్దరిపై ప్రత్యేకంగా అందరి దృష్టి పడింది. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఇక కెరీర్ల విషయానికొస్తే.. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం మూవీ చేస్తున్నారు. ఓ బేబీ లాంటి సూపర్ హిట్ తర్వాత సామ్- నందిని రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. మే 15న రిలీజ్ చేస్తామని కొన్ని రోజుల క్రితం మేకర్స్ అనౌన్స్ చేశారు. రాజ్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మా ఇంటి బంగారం మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అటు చైతూ.. మైథలాజికల్ థ్రిల్లర్ వృషకర్మ చేస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయింది. ఆగస్టు లేదా అక్టోబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో శోభిత స్పీడ్ పెంచేందుకు రెడీ అవుతున్నారు. పలు ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు.
