Begin typing your search above and press return to search.

నేనిప్పుడు టాప్-10లో లేను.. కానీ చాలా హ్యపీగా ఉన్నా: సమంత

స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   11 Sept 2025 3:35 PM IST
నేనిప్పుడు టాప్-10లో లేను.. కానీ చాలా హ్యపీగా ఉన్నా: సమంత
X

స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. కొంతకాలంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మయోసైటిస్‌ బారిన పడ్డ తర్వాత తనలో వచ్చిన మార్పులు, తెలుసుకున్న విషయాలను పంచుకున్నారు.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సామ్.. మయోసైటిస్ తో చేసిన పోరాటం తనను పూర్తిగా ఛేంజ్ చేసిందని తెలిపారు. ఎన్నో కొత్త విషయాలు నేర్పిందని వెల్లడించారు. అంతే కాదు.. అప్పటికీ ఇప్పటికీ తనలో చాలా మార్పులు వచ్చాయని చెప్పిన ఆమె.. లైఫ్ లో వేటికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలో బాగా తెలిసిందన్నారు.

ముఖ్యంగా తానెప్పుడూ సక్సెస్ అంటే అసలు గ్యాప్‌ లేకుండా సినిమాలు చేయడమని

నమ్మేదాన్ని అని తెలిపారు. అలా ఒక సంవత్సరంలో తాను నటించిన ఐదు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అదే తాను విజయమని అనుకున్నానని, ఎప్పుడూ అలాగే అనుకునేదాన్ని అని పేర్కొన్నారు.

"ఎప్పుడూ వరుసగా సినిమాల్లో నటించాలి.. పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రాల్లో యాక్ట్ చేయాలి.. టాప్-10 నటీనటుల జాబితాలో నేను ఉండాలి.. అని ఎప్పుడూ అనుకునేదాన్ని.. కానీ నా ఆలోచనలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. నేను ప్రస్తుతం టాప్-10లో లేను. నేను లీడ్ రోల్ లో నటించిన సినిమాలు వచ్చే రెండేళ్లు అయింది" అని చెప్పారు. తన వద్ద రూ.1000 కోట్లు సినిమాలు లేవని, కానీ ఉన్నంతలో హ్యాపీగా ఉన్నట్లు పేర్కొన్నారు

సామ్. తాను అప్పుడు శుక్రవారం వస్తే చాలు.. ఆందోళన ఉండేదని, ఎప్పుడూ భయపడేదాన్ని అని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో తన ప్లేస్ ను ఎవరైనా ఆక్రమిస్తారోనని.. క్యాలిక్యులేషన్స్‌ వేసుకుంటూ ఉండేదాన్ని అని సామ్ చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు అలా ఆలోచించడం లేదని తెలిపారు. తన గ్లామర్, సినిమాల వల్లే తనను అంతా ఫాలో అవుతున్నారని తెలుసని చెప్పిన సమంత.. వారికోసమే తాను హెల్త్‌ పాడ్‌ కాస్ట్‌ లు నిర్వహిస్తున్నానని చెప్పారు. హెల్త్ కు సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా ఎక్కడో వెతికే అవసరం ఉండకూడదని ఆ నిర్ణయం తీసుకుని, ఏడాది నుంచి చేస్తున్నానని తెలిపారు సామ్.