సామ్ 'మా ఇంటి బంగారం'.. లాంగ్ గ్యాప్ తర్వాత!
అయితే శుభం మూవీలో సామ్ క్యామియో రోల్ పోషించారు. దానిపై రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 8 May 2025 8:54 AMస్టార్ హీరోయిన్ సమంత అటు పలు ప్రాజెక్టుల్లో నటిస్తూనే.. ఇటు నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకునే పనిలో ఉన్నారు. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన తొలి సినిమా శుభంతో ఇప్పుడు సందడి చేయనున్నారు. మే 9వ తేదీన ఆ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
అయితే కొంత కాలం క్రితం తన బ్యానర్ పై మా ఇంటి బంగారం మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది తన పుట్టినరోజు నాడు సినిమాను అనౌన్స్ చేశారు. ఆ సమయంలో పవర్ ఫుల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో గృహిణిగా సామ్ కనిపించగా.. పోస్టర్ మాత్రం ఓ రేంజ్ లో అందరినీ మెప్పించింది.
కానీ అనౌన్స్మెంట్ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు సమంత. దీంతో సినిమా ఏమైందోనని అంతా డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు శుభం ప్రమోషన్స్ సమయంలో మా ఇంటి బంగారం మూవీ గురించి మాట్లాడారు. తన తర్వాత ప్రాజెక్ట్ అదేనని వెల్లడించారు. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు చెప్పారు.
ఆ తర్వాత వరుస ప్రాజెక్టుల్లో నటించనున్నట్లు సామ్ ఇన్ డైరెక్ట్ గా తెలిపారు. దీంతో ఆమె తెలుగులో మరోసారి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే సమయంలో వెయిటింగ్ ఫర్ మూవీస్ మేడమ్ జీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వరుసగా అప్డేట్స్ ఇచ్చేసి మూవీస్ పూర్తి చేసేయండి మేడమ్ అని అంటున్నారు.
అయితే శుభం మూవీలో సామ్ క్యామియో రోల్ పోషించారు. దానిపై రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. నిజానికి శుభంలో తాను గెస్ట్ రోల్ చేయాల్సిన అవసరం లేదని, కానీ నిర్మాతగా డెబ్యూ మూవీ కోసం ఎవరినీ సాయం అడగాలనుకోలేదని చెప్పారు. అందుకే తానే నటించానని పేర్కొన్నారు. ప్రమోషన్స్ అందుకే చేస్తున్నానని చెప్పారు.
ఇక ప్రమోషన్స్ లో మాత్రం ఫుల్ యాక్టివ్ గా పాల్గొన్నారు సామ్. వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈవెంట్స్ లో సందడి చేశారు. క్రేజీ వ్యాఖ్యలు చేశారు. నటిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న ఆమె.. ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అవ్వాలని థ్యేయంతో ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. మరి ఎలాంటి సక్సెస్ లు అందుకుంటారో వేచి చూడాలి.