Begin typing your search above and press return to search.

మ‌రో కొత్త బిజినెస్‌లోకి స‌మంత‌

కేవ‌లం కొత్త ప‌ర్‌ఫ్యూమ్ ను స్టార్ట్ చేయ‌డ‌మే కాకుండా దాన్ని ప్రీమియం లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మార్చ‌డానికి స‌మంత ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మంత స‌న్నిహిత వ‌ర్గాలంటున్నాయి.

By:  Tupaki Desk   |   18 July 2025 9:00 PM IST
మ‌రో కొత్త బిజినెస్‌లోకి స‌మంత‌
X

సౌత్ స్టార్ హీరోయిన్ స‌మంత రీసెంట్ గా సినిమాల విష‌యంలో చాలా త‌క్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తున్నారు. స‌మంత‌పై వార్త‌లొస్తున్న‌ప్ప‌టికీ అవి ఆమె సినిమాల‌కు సంబంధించిన‌వి కాకుండా తన పర్స‌న‌ల్ విష‌యాల గురించే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ తో పాటూ చాలా స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్ల‌ను చేస్తూ వ‌చ్చిన స‌మంత ఇటీవ‌ల ఎలాంటి పెద్ద సినిమాల్లోనూ న‌టించింది లేదు.

పెద్ద సినిమాల్లో న‌టించ‌క పోవ‌డ‌మే కాకుండా ఎలాంటి పెద్ద ప్రాజెక్టునీ అనౌన్స్ కూడా చేయ‌లేదు. దీంతో స‌మంత త‌ర్వాతి ప్రాజెక్టు ఏంటా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం స‌మంత ఇప్పుడు మ‌రో కొత్త వెంచ‌ర్ లోకి అడుగుపెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే న‌టిగా, నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా స‌క్సెస్ అయిన స‌మంత ఇప్పుడు మ‌రో కొత్త బిజినెస్ లోకి ఎంట‌ర‌వుతున్నారని స‌మాచారం. అదే ల‌గ్జ‌రీ పెర్‌ఫ్యూమ్.

కేవ‌లం కొత్త ప‌ర్‌ఫ్యూమ్ ను స్టార్ట్ చేయ‌డ‌మే కాకుండా దాన్ని ప్రీమియం లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మార్చ‌డానికి స‌మంత ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మంత స‌న్నిహిత వ‌ర్గాలంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కాన్సెప్ట్ నుంచి బ్రాండింగ్ వ‌ర‌కు ప్ర‌తీ దానిలోనూ స‌మంత ఇన్వాల్వ్ అవుతూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఫ్యాష‌న్ రంగంలో ఎప్పుడూ ముందుండే స‌మంత ఈ ఫ్యాష‌న్ ప్రాజెక్టును స‌క్సెస్‌ఫుల్ గా మార్చాల‌ని డిసైడై అందుకు త‌గ్గ అడుగులు వేస్తున్నట్టు క‌నిపిస్తోంది. ఇది స‌క్సెస్ అయితే స‌మంత కెరీర్లోనే ఓ కొత్త అధ్యాయం సృష్టించిన‌ట్టు అవుతుంది.

సినిమాల విష‌యానికొస్తే స‌మంత వ‌రుస పెట్టి సినిమాల‌ను ఓకే చేయ‌కుండా స్క్రిప్ట్స్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తేడాది మొత్తం మ‌యోసైటిస్ వ‌ల్ల సినిమాల‌కు దూరంగా ఉన్న స‌మంత ఇప్పుడు త‌న కంబ్యాక్ చాలా స్ట్రాంగ్ గా ఉండాల‌ని దానికి త‌గ్గ క‌థ‌ల‌నే ఎంచుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కైతే స‌మంత ఎలాంటి ప్రాజెక్టుకీ సైన్ చేయ‌లేదు కానీ రెండు ప్రాజెక్టులు చ‌ర్చ‌ల ద‌శ‌ల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందులో ఒక సినిమా తెలుగు కాగా మ‌రోటి బాలీవుడ్ ప్రాజెక్ట‌ని, స్టార్ డైరెక్ట‌ర్లు ఈ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని అంటున్నారు. అయితే స‌మంత ఈ రెండు సినిమాలు ఫైన‌ల్ అయ్యే లోపు త‌న ప‌ర్‌ఫ్యూమ్ బిజినెస్ తో అంద‌రినీ ఎట్రాక్ట్ చేసేలా క‌నిపిస్తున్నారు.