'అనారోగ్యం వల్లే భర్తలు అలా!'.. ఆ పోస్ట్ కు సమంత లైక్
స్టార్ హీరోయిన్ సమంత... సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 21 April 2025 3:27 PM ISTస్టార్ హీరోయిన్ సమంత... సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తన పాడ్ కాస్ట్ ద్వారా ఎన్నో ఉపయోగకరమైన విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు హెల్త్, ఉమెన్ ప్రొటక్షన్, రిలేషన్స్ సహా వివిధ అంశాలకు సంబంధించిన పోస్టులు పెడుతూనే ఉన్నారు. తనకు నచ్చిన పోస్టులకు లైక్స్ కూడా కొడుతున్నారు.
తాజాగా ఓ పోస్ట్ కు లైక్ చేసి వార్తల్లో నిలిచారు సామ్. అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికే భర్తలు మొగ్గు చూపుతున్నారంటూ వచ్చిన సర్వేకు సంబంధించిన పోస్ట్ కు ఆమె లైక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 60 వేల మందికిపైగా ఆ పోస్ట్ కు లైక్ కొట్టగా.. కేవలం సమంత చర్యపైనే అంతా మాట్లాడుకుంటున్నారు.
"లైఫ్ పార్టనర్ తీవ్ర అనారోగ్యం పాలైతే చాలు.. ఆమెను వదిలేయడానికి భర్తలు చూస్తున్నారు. కానీ మహిళలు మాత్రం అలా కాదు. భర్తకు ఆరోగ్యం ఎలా ఉన్నా విడిచిపెట్టాలని అనుకోవడం లేదు. భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్ల భర్తలు అలా చేస్తున్నారు. ఇది రీసెంట్ గా ఓ సర్వేలో తేలింది" అని సక్సెస్ వెర్స్ అనే ఇన్ స్టా అకౌంట్ పోస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో సక్సెస్ వెర్స్ ఇన్ స్టా పేజీ చేసిన పోస్ట్ కు సమంత లైక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే సామ్.. ఎప్పటికప్పుడు రకరకాల పోస్ట్స్ కు లైక్స్ కొడుతుంటారు. అదే విధంగా ఇప్పుడు లైక్ చేసి ఉంటారు. కానీ సక్సెస్ వెర్స్ పెట్టిన పోస్ట్ కు ఎందుకు సామ్ లైక్ కొట్టారోనని అంతా తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.
ఇక కెరీర్ విషయానికొస్తే.. సమంత సిల్వర్ స్క్రీన్ పై కనపడి గ్యాప్ వచ్చేసింది. చివరగా విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా చేసిన ఆమె.. మరో మూవీతో ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తన బర్త్ డే రోజు ఆ మూవీని అనౌన్స్ చేసిన ఆమె.. ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
తన సొంత బ్యానర్ పై ఆమెనే నిర్మిస్తున్నారు కూడా. త్వరలోనే సామ్ నిర్మాతగా వ్యవహరించిన మరో సినిమా శుభం విడుదల కానుంది. అయితే రీసెంట్ గా సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు సమంత. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ లో నటిస్తున్నారు. మహారాణి గా కనిపించనున్నారని తెలుస్తోంది.
