ఏంటి సమంతలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
ఐతే ఆమె లైఫ్ లో జరిగిన కొన్ని విషయాల వల్ల అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిలో చాలా డిస్టర్బ్ అయ్యింది.
By: Tupaki Desk | 21 April 2025 10:05 PM ISTసౌత్ స్టార్ హీరోయిన్ గా సమంత మొన్నటిదాకా టాప్ ప్లేస్ లో ఉన్నది. ఐతే ఆమె లైఫ్ లో జరిగిన కొన్ని విషయాల వల్ల అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిలో చాలా డిస్టర్బ్ అయ్యింది. ఐతే మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు తిరిగి ప్రయత్నిస్తుంది సమంత. ఈ క్రమంలో బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లు చేస్తూ వస్తుంది. ఐతే సమంత కొత్తగా ప్రొడక్షన్ లోకి దిగింది. ట్రాలాలా బ్యానర్ లో శుభం అనే సినిమా మొదలు పెట్టింది.
కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ సమంత చేస్తున్న ఈ ప్రయత్నం వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన శుభం సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఐతే సినిమా రైటింగ్ లో కూడా సమంత హ్యాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. నటిగా ఇన్నేళ్ల అనుభవం ఉన్న ఆమె ఒక కథను ఎలా తీస్తే ప్రేక్షకుల మెప్పు పొందే ఛాన్స్ ఉంటుంది.
ఇక తన ప్రొడక్షన్ లో సినిమా కాబట్టి స్క్రిప్ట్ విషయంలో తనకు తోచిన సలహాలు కూడా ఇచ్చిందట అమ్మడు. ఐతే సమంత కథలో ఇన్వాల్వ్ అవ్వడం గురించి తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ అమ్మడిలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఐతే సొంత బ్యానర్ లో సినిమా కాబట్టి మొదటి సినిమా సక్సెస్ చేసుకునే క్రమంలో సమంత తనలో ఉన్న అన్ని టాలెంట్ లను బయటకు తీసిందని తెలుస్తుంది.
అంతేకాదు ఈ సినిమా జనాల్లోకి వెళ్లేలా సమంత ముందుండి ప్రమోషన్స్ చేయాలని చూస్తుంది. సమంత ప్రమోషన్స్ లో దిగితే కచ్చితంగా సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. శుభం సినిమాలో సమంత క్యామియో ఉంటుందన్న టాక్ కూడా ఉంది. సో మొత్తానికి సినిమా కోసం సాం ఏం చేయాలో అంతకుమించి చేసిందని అర్థమవుతుంది. మరి అమ్మడు ఏమేరకు ఈ సినిమాతో మెప్పిస్తుంది అన్నది చూడాలి.
సమంత మాత్రం తన ప్రొడక్షన్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. శుభం హిట్ పడితే సమంత ప్రొడక్షన్ కి మొదటి సినిమాతోనే అదిరిపోయే సక్సెస్ అందుకోవాలని చూస్తుంది. మరి సమంత ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఆమెకు నెక్స్ట్ సినిమాలు తీసేలా సపోర్ట్ అందిస్తాయన్నది చూడాలి.
