మానసిక ప్రశాంతతపై సమంత పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ సమంత గత కొన్నాళ్లుగా వివిధ విషయాల్లో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లి చేసుకోగా తర్వాత ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు.
By: Tupaki Desk | 21 Jun 2025 5:43 PM ISTటాలీవుడ్ స్టార్ సమంత గత కొన్నాళ్లుగా వివిధ విషయాల్లో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లి చేసుకోగా తర్వాత ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఆ తర్వాత చైతన్య, శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకోగా, సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉందని, వారిద్దరూ కలిసే ఉంటున్నారని వార్తలొస్తున్నాయి.
అయితే సమంత సినిమాలతో బిజీగా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను ఫ్యాన్స్ కు అందిస్తూ వారితో రెగ్యులర్ గా టచ్ లో ఉండే సమంత తాజాగా ఇన్‌స్టాలో ఓ మెసేజ్‌ను స్టోరీస్ లో పోస్ట్ చేసింది. తన పోస్ట్ లో సమంత ఇతరుల మాటల్ని పట్టించుకోవద్దని చెప్పింది.
జీవితంలో ఏదైనా జరగనీ అన్నట్టు ఉంటే ప్రశాంతత రాదని, ఆ ప్రశాంతత కోసం ఎప్పుడూ సాధన చేస్తూనే ఉండాలని, ప్రశాంతతను ఎంజాయ్ చేయాలి కానీ, దాంతో పోరాడకూడదని, జరిగే దాన్ని జరగనివ్వాలని, నేను చేయాల్సింది అనుకునే బదులు నేను తప్పకుండా చేయాల్సిందే అనేలా మైండ్ ను మార్చుకోవాలని సమంత సూచించింది.
మనం పెట్టుకునే లిమిట్స్ అన్నీ మన అత్మగౌరవంలో భాగమేనని, నిశ్చలంగా ఉన్నప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుందని, మీ శక్తిని తీసుకునే అర్హత ఎవరికీ లేదని, గౌరవానికి ఒత్తిళ్లు ఎప్పుడూ అడ్డు కాకూడదని సమంత తన స్టోరీలో రాసుకొచ్చింది. అయితే సమంత ఉన్నట్టుండి సడెన్ గా మానసిక ప్రశాంతత గురించి ఎందుకు పోస్ట్ పెట్టిందనేది ఎవరికీ తెలియడం లేదు.
