ఇప్పుడు అన్నింటికీ సిద్ధంగా ఉన్నా
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సమంత గత కొన్నాళ్లుగా స్పీడు తగ్గించారు.
By: Tupaki Desk | 4 July 2025 11:15 AM ISTఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సమంత గత కొన్నాళ్లుగా స్పీడు తగ్గించారు. దానికి కారణం ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటమే. సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ట్రీట్‌మెంట్ లో భాగంగా సమంత ఓ ఏడాది పాటూ సినిమాల నుంచి బ్రేక్ కూడా తీసుకున్నారు.
బ్రేక్ తీసుకుని వచ్చాక కూడా సమంత ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ వాటిని చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు సమంత. దాంతో పాటూ ఆమె బాలీవుడ్ పై కూడా ఫోకస్ చేశారు. రీసెంట్ గా సమంత తెలుగులో ఏ సినిమాకూ సైన్ చేసింది కూడా లేదు. మొన్నీ మధ్యనే నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించిన సమంత తాజాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు.
మయోసైటిస్ నుంచి తాను కోలుకుంటున్నానని, పూర్తిగా కోలుకోనప్పటికీ గతంలో కంటే తాను చాలా బెటర్ గా ఉన్నానని ఆమె తెలిపారు. ఈ విషయంలో తాను చాలా ముందుగానే జాగ్రత్తపడాల్సింది కానీ పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు తాను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడు ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తనకు క్లారిటీ ఉందని సమంత చెప్పారు.
ఇదే సందర్భంగా రీసెంట్ గా తాను ఎక్కువ సినిమాలను చేయడం లేదనే విషయాన్ని కూడా ఆమె అంగీకరించారు. ఎక్కువ సినిమాలు చేయాలనే రేసులో నుంచి తనను తాను తొలగించుకున్నానని చెప్పిన సమంత, ఇకపై మంచి అభిరుచి ఉన్న సినిమాలనే చేయాలని డిసైడ్ అయినట్టు తెలిపారు. త్వరలోనే తన నుంచి కొన్ని క్రేజీ అనౌన్స్‌మెంట్స్ వింటారని, ఆల్రెడీ వాటికి సంబంధించిన వర్క్స్ మొదలయ్యాయని సమంత వెల్లడించారు.
