రుతుక్రమ సమస్యలు.. సమంత కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాలకు దూరంగా ఉన్నా.. వార్తల్లో మాత్రం ఎప్పుడూ టాప్ లోనే ఉంటున్నారని చెప్పాలి.
By: Tupaki Desk | 17 April 2025 7:00 PM ISTటాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాలకు దూరంగా ఉన్నా.. వార్తల్లో మాత్రం ఎప్పుడూ టాప్ లోనే ఉంటున్నారని చెప్పాలి. కొంతకాలంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై మాట్లాడుతూ వైరల్ అవుతున్నారు. స్పెషల్ పాడ్ కాస్ట్ లో ఎన్నో అవసరమైన విషయాలు షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.
రీసెంట్ గా తన పాడ్ కాస్ట్ లో ఆరోగ్య నిపుణులు రాశి చౌదరితో రుతుక్రమ ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారు. ఆరోగ్యం, పరిశుభ్రత సహా పలు విషయాలపై కామెంట్స్ చేశారు. ఎండోమెట్రియోసిస్ వంటి దీర్ఘకాలిక రుతుక్రమ రుగ్మతలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం వారి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఎండోమెట్రియోసిస్ తో సెలెబ్రిటీగా తాను పడ్డ కష్టాన్ని వివరించారు సామ్. చుట్టూ ఒత్తిడి ఉండడం.. వర్క్.. అలా ఎంతో బాధపడ్డానని అన్నారు. రుతుక్రమ సమస్యలు గురించి పురుషులు తెలుసుకోవాలని వ్యాఖ్యనించారు. మహిళల శరీరాల గురించి తెలుసుకోవాలనే వారికి జ్ఞానోదయం అవ్వాలని అభిప్రాయపడ్డారు. అనేక విషయాలు నేర్చుకోవాలని సూచించారు.
ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. మయోసైటిస్ బారినపడ్డ తర్వాత సినిమాలకు కాస్త దూరమైన విషయం తెలిసిందే. రీసెంట్ గా సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి.
ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ లో యాక్ట్ చేస్తుండగా.. రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సిరీస్.. త్వరలోనే స్టీమింగ్ కానుంది. అందులో సమంత మహారాణి రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. అప్పుడే ఆడియెన్స్ లో రక్త్ బ్రహ్మాండ్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు, మా ఇంటి బంగారం మూవీ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు సమంత. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె రూపొందిస్తున్న శుభం మూవీ త్వరలో రిలీజ్ కానుంది. మరి నిర్మాతగా.. నటిగా ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.
