Begin typing your search above and press return to search.

జిమ్ నుంచి వెళుతూ స‌మంత ఫైరింగ్

స‌మంత రూత్ ప్ర‌భు రెగ్యుల‌ర్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే విష‌యం అంద‌రికీ తెలుసు. జిమ్ యోగా సెష‌న్స్ ను నిరంత‌రం ఎంతో డెడికేష‌న్ తో ఫాలో చేస్తుంది.

By:  Tupaki Desk   |   17 Jun 2025 12:15 PM IST
జిమ్ నుంచి వెళుతూ స‌మంత ఫైరింగ్
X

స‌మంత రూత్ ప్ర‌భు రెగ్యుల‌ర్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే విష‌యం అంద‌రికీ తెలుసు. జిమ్ యోగా సెష‌న్స్ ను నిరంత‌రం ఎంతో డెడికేష‌న్ తో ఫాలో చేస్తుంది. ప్ర‌స్తుతం హిందీ వెబ్ సిరీస్ లు సినిమాల‌తో బిజీగా ఉన్న సామ్ ముంబైలోనే నివాసం ఉంటోంది. ముంబై బాంద్రాలోని పోష్ ఏరియాలో జిమ్ నుంచి వెళుతూ క‌నిపించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సామ్ త‌న వెంట‌ప‌డుతున్న‌ వారిపై సీరియ‌స్ అవుతూ క‌నిపించింది. ఓవైపు ఫోన్ చెవి ద‌గ్గ‌ర పెట్టుకుని ఎవ‌రితోనో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించింది. త్వ‌ర‌గా జిమ్ ని ముగించి త‌న కార్ కోసం వెతుకుతూ వెళుతూ క‌నిపించింది.

ఇంకా కార్ రాలేదు మ్యాడ‌మ్ అంటూ అక్క‌డ ఉన్న‌ మీడియా, ప‌బ్లిక్ కూడా సామ్ వెంట‌ప‌డ్డారు. అయితే తాను అసౌక‌ర్యంగా ఫీల‌వుతున్న స‌మ‌యంలో త‌న‌నే వీడియో షూట్ చేస్తున్న యువ‌కుల‌నుద్ధేశించి `స్టాప్ ఇట్ గ‌య్స్!` అంటూ చికాకు ప్ర‌ద‌ర్శించింది స‌మంత‌. త‌న టోన్డ్ దేహ‌శిరుల్ని అతుక్కుపోయిన స్కిన్ టైట్ స్పోర్ట్స్ వేర్ లో స‌మంత టూ హా* గా క‌నిపిస్తోంది.

బాంద్రాలో జిమ్ పూర్తి చేసుకుని తిరిగి త‌న గ‌మ్య‌స్థానానికి వెళుతోంది. అయితే త‌న‌ను వెంబ‌డించే ఆక‌తాయి కుర్రాళ్ల విష‌యంలోనే ఘ‌ర్ష‌ణ ప‌డుతూ క‌నిపించింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాల్లో వేగంగా వైర‌ల్ అయింది. స‌మంత ప్ర‌స్తుతం రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ర‌క్త్ బ్ర‌హ్మాండ్ వెబ్ సిరీస్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.