సమంత స్టన్నింగ్ లుక్‌కి ఫ్యాషన్ ప్రపంచం ఫిదా!
ఈ ఫొటోషూట్‌లో సమంత అటిట్యూడ్, కాన్ఫిడెన్స్, స్టైల్ అన్నీ కలిపి ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్‌కి సూట్ అయ్యేలా ఉన్నాయి.
By: Tupaki Desk | 27 Jun 2025 11:55 AM ISTటాలీవుడ్‌లో స్ట్రార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత తాజాగా ఓ స్టన్నింగ్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేసింది. GQ పవర్ లిస్ట్ 2025 ఈవెంట్‌కు హాజరైన సందర్భంలో ఆమె ధరించిన నెట్ డిజైన్ హై స్లిట్ గౌన్ లుక్‌కి నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. బ్లాక్ కాంబినేషన్‌లో మెరిసిన ఈ డ్రెస్‌కు మ్యాచింగ్ మేకప్, స్ట్రెయిట్ హెయిర్ స్టైల్ తో తన యాటిట్యూడ్‌ను మరింతగా హైలైట్ చేసింది.
ఈ ఫొటోషూట్‌లో సమంత అటిట్యూడ్, కాన్ఫిడెన్స్, స్టైల్ అన్నీ కలిపి ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్‌కి సూట్ అయ్యేలా ఉన్నాయి. ఆమె ఈ లుక్‌లో కేవలం గ్లామర్‌తోనే కాదు, తనలో ఉన్న స్ట్రాంగ్ వైబ్ ని చూపించగలిగింది. నెట్ మెష్ డిజైన్‌తో ఉన్న ఈ డ్రస్సుకు స్లిట్ కట్ ఆకర్షణీయంగా ఉండి, సామంత యొక్క బోల్డ్ లుక్‌కు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు “ఈ లుక్‌తోనే మళ్లీ ట్రెండ్ లోకి వచ్చేసింది” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కెరీర్ పరంగా చూస్తే... తాజాగా ఆమె ‘బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇది ఆమె కామ్‌బ్యాక్ మూవీగా ట్రీట్ అవుతోంది. అంతేకాదు, ఓ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ అయిన ‘రక్త బ్రహ్మాండ’లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడిన సామ్ కొంతకాలం విరామం తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది.
తన ఫిట్‌నెస్ ప్రయాణంలో భాగంగా వ్యాయామం, ధ్యానం, వైద్య చికిత్సలను పక్కాగా అనుసరిస్తూ, ఇప్పుడు మళ్లీ షూటింగ్‌కి సిద్ధమవుతోంది. “ఆరోగ్యం కోల్పోయినప్పుడే మన అసలు బలాన్ని గుర్తించగలం” అంటూ గతంలో చెప్పిన సామ్ ఇప్పుడు మళ్లీ తన పని పట్ల కమిట్‌మెంట్ చూపిస్తూ, అన్ని ఫ్రంట్‌లలో ముందుకు వెళ్తోంది. ఈ తాజా లుక్‌ద్వారా ఆమె ఇప్పటికీ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచినట్టు మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలు ఇప్పటికే లక్షల్లో లైక్స్ సంపాదించాయి. కామెంట్లలో అభిమానులు ఆమె స్టైల్, గ్లామర్, గ్రేస్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
