Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్‌కి స్పాలో మసాజులు

త‌ను ఎక్క‌డ ఉన్నా జిమ్ ని విడిచిపెట్ట‌దు. విదేశాల‌కు వెళ్లినా ఎక్స్ క్యూజ్ చేయ‌దు.

By:  Tupaki Desk   |   29 March 2025 8:56 PM IST
Samantha fitness goals
X

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే. ఫిజికల్ ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ముందుకు సాగితే వ‌య‌సు దేనికీ అడ్డంకి కాదు. యాభై వ‌య‌సులోను అల్ట్రా ఫిట్ లుక్ తో ర్యాంప్ ని అల్లాడిస్తున్న మ‌లైకా అరోరా, క్లాసిక్ డే మేటి న‌టి రేఖ‌ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే అలాంటి ముందు చూపు స‌మంత రూత్ ప్ర‌భుకు కూడా ఉంది. ఓవైపు వ్యాయామం.. మ‌రోవైపు వెకేష‌న్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ సామ్ విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. చాలా మంది విరామం దొరికితే చాలు.. జిమ్ యోగా సెష‌న్లు ఎలా ఎగ్గొట్టాలా? అని చూస్తారు. కానీ త‌న‌తో పాటే త‌న జీవితంలో వీటిని ఒక భాగంగా మార్చింది సామ్. త‌ను ఎక్క‌డ ఉన్నా జిమ్ ని విడిచిపెట్ట‌దు. విదేశాల‌కు వెళ్లినా ఎక్స్ క్యూజ్ చేయ‌దు.

సెల‌వుల్లో తనను తాను రీఇమాజిన్ చేయ‌డానికి రీడిజైన్ చేయ‌డానికి ఒక మంచి అవకాశంగా చూస్తుంది స‌మంత‌. ఆస్ట్రేలియాలో సామ్ కేవలం విశ్రాంతి తీసుకోవడం లేదు. ప్రతి క్షణాన్ని సొంతం చేసుకుంటుంది. ఓవైపు జిమ్ కి వెళ్లి క‌స‌ర‌త్తులు చేస్తూనే, మ‌రోవైపు స్పాలో స్పెష‌ల్ ట్రీట్ తో రీజ‌న‌వేట్ అవుతోంది. ఒకే ఒర‌లో రెండు ప‌దునైన క‌త్తుల‌ను ఉప‌యోగించ‌డం స‌మంత‌కు బాగా తెలుసున‌ని ప్రూవ్ చేస్తోంది.

స్పా ట్రీట్ వ‌ల్ల శ‌రీరం తేలిక‌ప‌డుతుంది. రుగ్మ‌త‌ల్ని ఇది పార‌ద్రోలుతుంది. మైండ్ కూడా ప్యూర్ అవుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ ఎంత బావుంటే, అంత‌గా మాన‌సిక ఆనందం మెరుగ‌వుతుంది. జిమ్ - స్పా ట్రీట్ దీనికి బాగా క‌లిసొస్తుంద‌ని వ్యాయామ నిపుణులు చెబుతారు. సామ్ అన్నిటినీ తిరిగి సాధించుకుంటోంది. వ‌య‌సు న‌ల‌భైకి ద‌గ్గ‌ర‌వుతున్న కొద్దీ స‌మంత మ‌రింత జాగ్ర‌త్త‌గా త‌న‌ను తాను మ‌లుచుకుంటోంది. సినిమా.. బిజినెస్.. ఫిట్ నెస్ విజ‌న్ ఏదైనా కానీ రొటీనిటీని బ్రేక్ చేస్తూ త‌న‌దైన యూనిక్ స్టైల్ తో దూసుకుపోతోంది. అందుకే సామ్ ఈజ్ గ్రేట్. సిటాడెల్ హ‌నీ బ‌న్నీ త‌ర్వాత సొంత బ్యాన‌ర్ సినిమా బంగారంపై స‌మంత దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే.