సమంతకు అంతా శుభమే..!
మే 9న రిలీజ్ అవుతున్న సమంత శుభం సినిమాను తెలుగు రెండు రాష్ట్రాల్లో బడా నిర్మాణ సంస్థలు సపోర్ట్ అందిస్తున్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 9:50 PM ISTస్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి చేస్తున్న మొదటి ప్రయత్నమే శుభం. తొలి సినిమా టైటిల్ శుభం అని పెట్టి నిర్మాతగా తన కెరీర్ శుభప్రదంగా ఉండాలని చూస్తుంది సమంత. అనుకున్నట్టుగానే అమ్మడి మొదటి ప్రాజెక్ట్ కి మంచి బజ్ ఏర్పడింది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో తెరకెక్కిన శుభం సినిమాలో అంతా కొత్త నటీనటులు నటించారు. సినిమాకు బడ్జెట్ కూడా తక్కువే అయ్యి ఉంటుంది. కానీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది.
మే 9న రిలీజ్ అవుతున్న సమంత శుభం సినిమాను తెలుగు రెండు రాష్ట్రాల్లో బడా నిర్మాణ సంస్థలు సపోర్ట్ అందిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస క్రేజీ సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటింగ్ రంగంలో కూడా ఉన్నారు. సమంత శుభం సినిమా నైజాం ఏరియా మొత్తం మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కొనేశారట. వారే సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మరోపక్క ఏపీలో సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రెండు కూడా పెద్ద డిస్ట్రిబ్యూషన్ బెల్ట్ ఉన్న సంస్థలే కాబట్టి సమంత శుభం సినిమాకు మంచి రిలీజ్ దొరికినట్టే లెక్క. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత డిజిటల్, శాటిలైట్ రైట్స్ కి మంచి డిమాండ్ ఏర్పడిందని తెలుస్తుంది. సినిమా ఐదారు కోట్లలో పూర్తి చేసిన సమంత రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ అందుకుందని తెలుస్తుంది.
నిర్మాతగా తొలి సినిమానే అయినా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే ప్రాజెక్ట్ ని తీసుకొస్తుంది సమంత. అందుకే శుభం ట్రైలర్ రిలీజ్ కాగానే ట్రెండింగ్ లో ఉంది. అదే ఇప్పుడు సినిమా బిజినెస్ కూడా బాగా జరిగేలా చేసింది. మైత్రి రిలీజ్ ద్వారా కాబట్టి మంచి సెంటర్స్ లో శుభం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నిర్మాతగా సమంత తొలి సినిమా సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేస్తుంది. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సమంత పంట పండినట్టే లెక్క. హీరోయిన్ గా సక్సెస్ అవ్వడమే కాదు నిర్మాతగా కూడా తన సక్సెస్ మేనియా కొనసాగించాలని చూస్తుంది సమంత. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఐతే సమంత నిర్మాతగా కూడా తన టేస్ట్ ని తెలియచేయడం ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. శుభం హిట్ పడితే సమంత నిర్మాతగా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
