ఆ సినిమాలు ఇప్పుడు చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి, ఆమె టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
By: Tupaki Desk | 20 April 2025 9:00 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి, ఆమె టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.
భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సక్సెస్ అయిన సమంత ప్రస్తుతం నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా మారింది. ఆడియన్స్ కు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందించాలనే కోరికతో నిర్మాతగా మారిన సమంత నుంచి మొదటిగా శుభం అనే సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఓ ఈవెంట్ లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
శుభం సినిమాలోని నటీనటులందరూ కొత్త వారే అని, కొత్తవాళ్లే అయినప్పటికీ వారంతా తమ యాక్టింగ్ తో తనను కదిలిందించారని సమంత పేర్కొంది. ఫ్యూచర్ లో వాళ్లందరూ తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తారని సమంత తెలిపింది. తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ మంచి కంటెంట్ ను ఆదరిస్తారని, మంచి కథ ఉన్న సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేస్తారని సమంత తెలిపింది.
తను నిర్మించిన సినిమాలో నటించిన నటీనటులంతా కొత్తవాళ్లే అయినప్పటికీ అద్భుతంగా నటించారని చెప్పింది. హీరోయిన్ గా తన కెరీర్ స్టార్ట్ అయినప్పుడు తనకు యాక్టింగ్ గురించి పెద్దగా తెలియదని, తాను నటించిన మొదటి రెండు సినిమాలను ఇప్పుడు చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుందని, తన నటన ఆ సినిమాల్లో అంత దారుణంగా ఉంటుందని, వాటిని చూసినప్పుడల్లా ఇంకా బాగా యాక్ట్ చేసుండాల్సింది అనిపిస్తుందని సమంత చెప్పింది.
శుభం సినిమాలో నటించిన వాళ్లు తనలా కాదని, మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో గొప్పగా నటించి మెప్పించారని, శుభం సినిమా కూడా మనసుని హత్తుకునే కంటెంట్ తో అందరినీ ఆకట్టుకుంటుందని సమంత తెలిపింది. జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ ను ఎదుర్కోవడం తనకు ఇష్టమని, అందుకే తాను నిర్మాతగా మారానని, నిర్మాతగా ఇది తనకొక కొత్త జర్నీ అని సమంత తెలిపింది. శుభం సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
