సమంత ఏమేం తింటుందో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 July 2025 9:00 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఏదొక రూపంలో వార్తల్లోకెక్కుతున్న సమంత ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమాల విషయంలో కాదు. గత కొన్నాళ్లుగా సమంత ఫాలో అవుతున్న హైల్తీ మరియు స్ట్రిక్ట్ డైట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
రీసెంట్ గా సమంత, సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండోతో జరిగిన చాట్ సెషన్ లో గత కొన్నేళ్లుగా తన ఆహారపు అలవాట్లు ఎంతలా మారాయో వెల్లడించారు. ప్రస్తుతం సమంత యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ను ఫాలో అవుతున్నారట. కేవలం స్లిమ్ గా ఉండటానికి మాత్రమే తాను ఈ డైట్ ను ఫాలో అవడం లేదని, లోపలి నుంచి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ను నివారించడానికి కూడా ఈ డైట్ ఎంతో ఉపయోగపడుతుందని సమంత చెప్తున్నారు.
గతంలో తాను సన్నగానే ఉండేదాన్నని, సన్నగా ఉండటంతో ఎలాంటి రూల్స్ పెట్టుకోకుండా ఏదైనా తినొచ్చని అనుకునేదాన్నని, కానీ తర్వాత సిట్యుయేషన్స్ మొత్తం మారిపోయాయని చెప్పిన సమంత, మన బాడీకి ఏది పడదో దాన్ని తెలుసుకుని వెంటనే దాన్ని తినడం మానేయాలని చెప్పారు. గత కొన్నాళ్లుగా తాను ప్రతీరోజూ ఒకే రకమైన ఫుడ్ ను తీసుకుంటున్నట్టు తెలిపారు సమంత.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గా స్మూతీలు, రెగ్యులర్ గా లంచ్, డిన్నర్ తింటున్నానని, భోజనంలో ఎక్కువగా బ్రోకలీ, క్యాలీఫ్లవర్, మొలకలు లాంటి పోషకాలుండే కూరగాయలను ఎక్కువగా తీసుకుంటానని చెప్పారు. పాలకూర, కాలే ఇష్టం లేక వాటి స్థానంలో వేరే వాటిని రీప్లేస్ చేసినట్టు తెలిపారు. అంతేకాదు సమంత ఎక్కడికెళ్లినా ఆఖరికి షూటింగ్స్ కు కూడా తన అసిస్టెంట్ ను తీసుకెళ్తారట. ఆ అసిస్టెంటే సమంతకు వంట చేసి పెడతారట.
ఇక సినిమాల విషయానికొస్తే సమంత రీసెంట్ గానే సిటాడెల్ అనే వెబ్‌సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను మొదలుపెట్టి అందులో శుభం అనే సినిమాను తీసి నిర్మాతగా కూడా మంచి విజయాన్ని అందుకున్నారు సమంత. ప్రస్తుతం తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాను సొంత బ్యానర్ లోనే చేయబోతున్న సమంత, బాలీవుడ్ లో రక్త్ బ్రహ్మాండ్ లోనూ నటిస్తున్నారు.
