Begin typing your search above and press return to search.

ఖాళీగా ఉన్నా సమంత కాన్పిడెన్స్ కోల్పోలేదు!

స్టార్ హీరోయిన్ గా వెలిగిన భామ ఒక్క‌సారిగా అవ‌కాశాలు రాక‌పోయినా? వ‌చ్చిన అవ‌కాశాలు న‌చ్చ‌క వ‌దులు కున్నా? కొంత గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటారు.

By:  Tupaki Desk   |   15 Jun 2025 12:00 AM IST
ఖాళీగా ఉన్నా సమంత కాన్పిడెన్స్ కోల్పోలేదు!
X

స్టార్ హీరోయిన్ గా వెలిగిన భామ ఒక్క‌సారిగా అవ‌కాశాలు రాక‌పోయినా? వ‌చ్చిన అవ‌కాశాలు న‌చ్చ‌క వ‌దులు కున్నా? కొంత గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటారు. గ్యాప్ అన్న‌ది అతి పెద్ద సమ‌స్య‌గా మారుతుంది. ఈ క్ర‌మంలో ఎంతో ఒత్తిడికి గుర‌వుతుంటారు. స్టార్ ఇమేజ్ ను కోల్పోతున్నామ‌నే బెంగ ఏర్ప‌డుతుంది. కానీ స‌మంత మాత్రం ఎక్క‌డా కుంగ‌లేదు. అంతే సంక‌ల్ప బ‌లంతో ముందుకెళ్తుంది. ఖుషీ వ‌ర‌కూ స‌మంత ఎంత బిజీగా ఉందో తెలిసిందే.

ఆ త‌ర్వాత అమెరికా వెళ్లి ఏడాది పాటు రెస్ట్ తీసుకుని తిరిగొచ్చిన త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ హీరోయిన్ గా ఒక్క సినిమా రిలీజ్ చేయ‌లేదు. సీరియ‌స్ గా బాలీవుడ్ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నా రావ‌డం లేదు. కొన్ని వెబ్ సిరీస్ ల‌కు అయిన క‌మిట్ మెంట్లు త‌ప్ప‌? స‌మంత‌కు మాత్రం అక్క‌డ అవ‌కాశం రావ‌డంలేదు. స‌మం త క‌న్నా వెన‌కెళ్లిన వాళ్లు కూడా బిజీ అవుతున్నారు గానీ సామ్ మాత్రం ఇంత‌వ‌ర‌కూ ఒక్క సినిమాకు సంత‌కం చేయ‌లేదు.

అలాగ‌ని టాలీవుడ్ లో చేస్తుందా? అంటే ఇక్క‌డా అదే ప‌రిస్థితి. ఇక్క‌డ అవ‌కాశాలు వ‌స్తున్నా? న‌టించ‌డం లేదు. ఇంకా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో ఏన‌టిపైనా నెగివిటీ స్ప్రెడ్ అవు తుంది. స‌మంత‌పైనా ఇలాంటి క‌థ‌నాలెన్నో. ఈ నేప‌థ్యంలో సామ్ స‌క్సెస్ గురించి కొన్ని విలువైన సంగ తులు చెప్పింది. 'అస‌లైన విజయం అంటే స్వేచ్ఛ‌. అభివృద్ధి , పరిణితి సాధించడం. దేనికి బంధీగా మార‌కూడ‌దు.

అదే నిజ‌మైన స్వేచ్ఛ‌. రెండేళ్ల‌గా సినిమాలు చేయ‌క‌పోయినా నేను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. విరా మాన్ని ఆస్వాదించా. ఎంతో స్వేచ్చ‌గా విహ‌రించాను. నా చుట్టూ ఉన్నా వారు ఇదేంటి ఖాళీగా ఉండి ఇలా మాట్లాడుతుంద‌నున‌కుంటారు? కానీ నా వ్యక్తిగత దృష్టిలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా పనులే నాలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.