ఆ విషయంపై సమంత క్లారిటీ..!
మొన్నటిదాకా హీరోయిన్ గా ఉన్న సమంత ఇప్పుడు కొత్త బాధ్యత మీద వేసుకుంది. నిర్మాతగా ఆమె చేసిన తొలి ప్రయత్నం శుభం మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
By: Tupaki Desk | 6 May 2025 10:10 PM ISTమొన్నటిదాకా హీరోయిన్ గా ఉన్న సమంత ఇప్పుడు కొత్త బాధ్యత మీద వేసుకుంది. నిర్మాతగా ఆమె చేసిన తొలి ప్రయత్నం శుభం మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన శుభం సినిమా ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. యంగ్ టీం తమ సినిమాను బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో సమంత చాలా సంతోషంగా కనిపించింది.
ఐతే ఈవెంట్ లో భాగంగా సమంత ఒకసారి కళ్లు తుడుచుకున్నట్టుగా ఒక వీడియో వైరల్ అయ్యింది. సమంత ఎమోషనల్ అవుతుందని ఆమె ఇంకా ఏదో విషయంలో బాధపడుతుంది అన్నట్టుగా మీడియాలో వార్తలు రాసుకొచ్చారు. ఐతే లేటెస్ట్ గా శుభం రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సినిమాకు సంబందించిన విషయాల గురించి ప్రస్తావించారు.
దాంతో పాటుగా తన వీడియో గురించి క్లారిటీ ఇచ్చారు సమంత. ఐ సెన్సిటివిటీ వల్ల కళ్ల వెంట నీళ్లు వచ్చాయి అందుకే దాన్ని సరిచేసుకున్నా అంతే కానీ అది వేరే ఏమి కాదని అన్నారు సమంత. ఇలాంటి వార్తలను దయచేసి నమ్మకండి అని అన్నారు. సమంత అంతకుముందు శాకుంతలం సినిమా ఈవెంట్ లో కూడా ఎమోషనల్ అయ్యారు. మరి అది కూడా జస్ట్ ఐ సెన్సిటివ్ అంటారేమో.. ఐతే శుభం ఈవెంట్ లో మాత్రం ఆమె వీడియో చూసి సమంత ఎమోషనల్ అవుతుందనే అనుకున్నారు.
సమంత క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఇక ఆ వీడియో గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. శుభం తో మొదలు పెట్టిన సమంత ప్రొడక్షన్ ఇంకా ఇలాంటి మరెన్నో సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. సమంత కూడా కొత్త వారికి అవకాశం ఇస్తూ మంచి కథలతో తన బ్యానర్ లో సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు నటిగా చేస్తున్నప్పుడు తెలియలేదు కానీ నిర్మాతగా వ్యవహరించడం చాలా కష్టమని అన్నారు సమంత. నిర్మాతగా తొలి సినిమానే అయినా సమంత చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమా మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే సమంత ఇలా కనిపిస్తున్నారని అంటున్నారు. ఐతే సమంత నెక్స్ట్ మా ఇంటి బంగారం సినిమాతో రాబోతుంది.
