Begin typing your search above and press return to search.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. బ్రాండ్స్ పై సామ్!

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలపై మాట్లాడారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 April 2025 2:56 PM IST
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. బ్రాండ్స్ పై సామ్!
X

స్టార్ హీరోయిన్ సమంత.. కొంతకాలంగా తన రూట్ ఛేంజ్ చేసేశారని చెప్పాలి. సెల్ఫ్ లవ్, హెల్త్, వర్కౌట్స్, పీస్ ఫుల్ నెస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు మోటివేషన్ తో పాటు మహిళా సాధికారత వంటి అంశాలపై పోస్టులు పెడుతున్నారు.

సినిమాలు, వెబ్ సిరీసుల విషయానికొస్తే.. తనకు అన్ని విధాలుగా ఓకే అయితేనే మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలపై మాట్లాడారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ పై సామ్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. రూ. కోట్లలో డబ్బులు వస్తున్నా.. తాను ఇటీవల ఎన్నో బ్రాండ్స్ ఎండార్స్మెంట్స్ ను వదులుకున్నానని తెలిపారు.

20 ఏళ్ల వయసులో తాను ఇండస్ట్రీలోకి వచ్చానని, అప్పట్లో సక్సెస్ అంటే మీనింగ్ వేరే అని సమంత చెప్పారు. ఎన్ని సినిమాల్లో నటించాం, ఎన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేశాం.. ఆ కౌంట్ పైనే సక్సెస్ ను డిసైడ్ చేసేవారని అన్నారు. అప్పుడు తాను మల్టీనేషనల్‌ బ్రాండ్స్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు సామ్.

"అప్పుడు ఎంతో హ్యాపీగా ఫీలయ్యా. కానీ ఇప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నా. బ్రాండ్స్ ఎండార్స్మెంట్స్ చేసినప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలని తెలుసుకున్నా. అందుకే ఇప్పుడు సారీ చెబుతున్నా. ఏడాదిలో కొన్ని కోట్ల రూపాయలు ఇస్తామని చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను 15 బ్రాండ్స్ వదులుకున్నా" అని చెప్పారు సామ్.

"అయితే నా వద్దకు ఆఫర్స్ ఎన్నో వస్తూనే ఉంటాయి. కానీ వాటిని నేను వెంటనే యాక్సెప్ట్ చేయను. ముందుగా ఆ ఉత్పత్తుల కోసం ఆరా తీస్తాను. తెలిసిన ముగ్గురు వైద్యులను సంప్రదిస్తాను. వాటి పరిస్థితి తెలుసుకుంటాను. సమాజానికి హాని చేయవని డిసైడ్ అయ్యాకే ముందుకు వెళ్తాను. అలానే ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నా" అని సమంత తెలిపారు.