సమంతకు ఊహించని షాకులు!
అందులో సమంత నటిస్తున్నట్లు జాడ ఎక్కడా కనిపించలేదు. అప్పుడప్పుడు మనోజ్ బాజ్ పాయ్ ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు.
By: Tupaki Desk | 20 April 2025 9:15 AM ISTసమంత మకాం హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చిన తర్వాత బాలీవుడ్ అవకాశాల కోసం ఎంతగా ప్రయ త్నిస్తుందో తెలిసిందే. దాదాపు రెండేళ్లగా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. కానీ కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతుండగా...మరికొన్ని ఊహించని షాకుల రూపంలో తగులుతున్నాయి. 'ఖుషీ' రిలీజ్ తర్వాత తెలుగు తెరపై సమంత కనిపించింది. బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైనైనా మెరిసిందా? అదీ లేదు.
'ఫ్యామిలీ మ్యాన్ 2' తో ఓటీటీలో ఫేమస్ అయిన బ్యూటీ ఫ్యామిలీ మ్యాన్ 3లోనూ కీలక పాత్రలో కనిపిస్తుంద నుకున్నారంతా. కానీ ఆ సిరీస్లో సమంత ఉన్నట్లు కనిపించలేదు. ఇప్పటికే థర్డ్ పార్ట్ చిత్రీకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అందులో సమంత నటిస్తున్నట్లు జాడ ఎక్కడా కనిపించలేదు. అప్పుడప్పుడు మనోజ్ బాజ్ పాయ్ ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు. కానీ సమంత గురించి ఆయన కూడా ఎక్కడా మాట్లాడం లేదు.
ఇవన్నీ చూస్తుంటే ఆ సిరీస్ లో సామ్ లేనట్లే కనిపిస్తుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ రీమేక్ రూపంలో హిందీ వెర్షన్ 'సీటాడెల్' లో మెయిన్ లీడ్ లో నటించింది. కానీ ఇండియాలో ఆశించిన రెస్పాన్స్ రాకపోవడంతో సీజన్ 2 రద్దు చేసారు రాజ్ అండ్ డీకే. అలాగే 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల మూవీంగ్ పిక్చర్స్ లో చేస్తోంది. తనే లీడ్ రోల్ పోషిస్తుంది. కానీ ఆ సినిమా అప్ డేట్ కూడా లేదు.
ఇక బాలీవుడ్ లో కనిపిస్తుంది 'రక్త బ్రహ్మాండ్' ఒక్కటే. అధికారికంగా సమంత చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ఇదొ క్కటే. అటు సినిమాలు లేక ఇటు వెబ్ సిరీస్ లతోనూ బిజీగా లేక సమంత మళ్లీ డైలమాలో పడే పరిస్థితి కనిపి స్తుంది. 'ఖుషీ' రిలీజ్ తర్వాత అమెరికా నుంచి ముంబై చేరిన అమ్మడి జర్నీ ఇలా సాగుతుంది.
