Begin typing your search above and press return to search.

సమంతకి ఇచ్చిన మాట మర్చిపోయిన త్రివిక్రమ్..?

సో త్రివిక్రం ఛాన్స్ ఇస్తానంటే సమంత కాదనే ఛాన్స్ లేదు కానీ.. ఆయనే సమంతకు సూటయ్యే పాత్ర ఇవ్వాలని అనుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 8:30 AM IST
సమంతకి ఇచ్చిన మాట మర్చిపోయిన త్రివిక్రమ్..?
X

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ కి కాస్త దూరమై బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది. సిటాడెల్ వెబ్ సీరీస్ తో అలరించిన సమంత అక్కడే మరో రెండు సినిమాలకు సైన్ చేసిందని తెలుస్తుంది. ఐతే సమంత తెలుగులో ఛాన్స్ లు వచ్చినా చేయట్లేదా.. లేదా ఆమెను ఎవరు తీసుకోవట్లేదా అన్న క్లారిటీ లేదు. లాస్ట్ ఇయర్ అలియా భట్ జిగ్రా సినిమా తెలుగు ప్రమోషన్స్ లో త్రివిక్రం లాంటి వాళ్లు సమంత తెలుగులో వరుస సినిమాలు చేయాలని అన్నారు.

ఆ టైం లో సమంత కూడా మీరు రాస్తే నేను నటిస్తానని చెప్పింది. సమంత నటిస్తానంటే తను రాస్తా అన్నట్టుగా అప్పుడు చెప్పారు. ఐతే సమంత కోసం త్రివిక్రం ఇచ్చిన మాట మర్చిపోయినట్టు ఉన్నాడు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రం తీసే సినిమాల్లో అయినా సమంత ఉంటుందని అనుకున్నారు కానీ అలా జరగట్లేదు. త్రివిక్రం తీసిన సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ సినిమాల్లో సమంత నటించింది.

సో త్రివిక్రం ఛాన్స్ ఇస్తానంటే సమంత కాదనే ఛాన్స్ లేదు కానీ.. ఆయనే సమంతకు సూటయ్యే పాత్ర ఇవ్వాలని అనుకుంటున్నాడు. సౌత్ సినిమాల్లో నటించాలన్న ఆలోచన లేని సమంత ఒకవేళ గురూజీ ఛాన్స్ ఇస్తానన్నా ఓకే అంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

తెలుగులో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటించిన సమంత శుభం సినిమా తో సర్ ప్రైజ్ చేసింది. ఐతే శుభం సినిమా ఆమె నిర్మాణంలో వచ్చింది. ప్రొడ్యూసర్ గా సమంత మొదటి సినిమాతో సక్సెస్ అందుకుంది. ఇక ఆమె నిర్మాతగా కూడా వరుస ప్రాజెక్ట్ లు చేయాలని చూస్తుంది. కథానాయికగా సినిమాలు చేస్తూ నిర్మాతగా కూడా కొనసాగాలని చూస్తుంది సమంత. తెలుగులో ఒక్కటంటే ఒక్క ఆఫర్ రావట్లేదని ఫీల్ అవుతున్న సమంత త్రివిక్రం లాంటి వాళ్లు కూడా తనను పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతుంది.

బాలీవుడ్ లో అయితే సమంతకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సీరీస్ లతో ఆమె అక్కడ స్టార్ రేంజ్ అందుకుంది. నటిగా వెబ్ సీరీస్ లతో తన కొత్త యాంగిల్ ని చూపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది సమంత. ఐతే వెబ్ సీరీస్ లతో కాదు అమ్మడు సినిమాలతో ఇంకాస్త ప్రభావం చూపించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.